LuLu Mall | హైదరాబాద్‌లో ప్రపంచ స్థాయి షాపింగ్ అనుభవం.. రేపు మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా లులు మాల్ ప్రారంభం
LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మాల్ ప్రారంభం కానుంది.
హైదరాబాద్: యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఈ మాల్ ప్రారంభం కానుంది. ఐదు లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న లులు మాల్.. రెండు లక్షల చదరపు అడుగుల హైపర్ మార్కెట్‌తోపాటు అత్యంత అధునాతన గ్లోబల్ రిటెయిల్ షాపింగ్ అనుభవాన్ని అందిస్తుంది.నగరంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న కూకట్‌పల్లిలో ఈ మెగా షాపింగ్ మాల్ ఉంది.
లులు గ్రూప్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ యూసఫ్ అలీ ఎంఏ, ఇతర ప్రముఖుల సమక్షంలో రేపు మంత్రి ఈ మాల్‌ను ప్రారంభించనున్నారు. రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి ప్రజల కోసం ఈ మాల్ తెరిచి ఉంటుంది. తెలంగాణలో లులు గ్రూప్‌కి ఇది మొదటి వెంచర్. రాష్ట్రంలో రూ.500 కోట్ల పెట్టుబడుల హామీలో భాగంగా ఈ ప్రాజెక్ట్ హైదరాబాద్‌లో నిర్మితమైంది. గత ఏడాది దావోస్‌లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్‌కు పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు హాజరయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వంతో అనేక చర్చలు, అవగాహన ఒప్పందాలు జరిగాయి. అందులో భాగంగానే లులు మాల్ హైదరాబాద్‌కు వచ్చింది.
1,400 సీటింగ్ కెపాసిటీగల 5-స్క్రీన్ సినిమా
రూ.300 కోట్ల పెట్టుబడితో అందుబాటులోకి వచ్చిన లులు మాల్ తెలంగాణ ప్రజలకు అంతర్జాతీయ షాపింగ్ అనుభవాన్ని అందించనుంది. ఈ మెగా మాల్లో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లులూ హైపర్‌మార్కెట్, 75 కంటే ఎక్కువ స్థానిక, అంతర్జాతీయ బ్రాండ్లు, 1,400 మంది సీటింగ్ కెపాసిటీ కలిగిన 5-స్క్రీన్ సినిమా, మల్టీ-క్యూసిన్ ఫుడ్ కోర్ట్, పిల్లల వినోద కేంద్రం మొదలైనవి ఉన్నాయి. అంతేగాక ఈ మాల్ 2,000 మందికి పైగా సిబ్బందికి ఉపాధి కల్పిస్తుంది.
హైలైట్‌గా లులు హైపర్ మార్కెట్
లులు హైపర్ మార్కెట్ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో లులు మాల్లో హైలైట్‌గా ఉంటుంది. ఇది విస్తృతమైన తాజా ఉత్పత్తులు, కిరాణా సామాగ్రిని కలిగి ఉంటుంది. ఫ్యాషన్, గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, మొబైల్స్, సాంకేతిక, జీవనశైలి ఉత్పత్తుల కోసం ‘లులు ఫ్యాషన్ స్టోర్’, ‘లులు కనెక్ట్ బ్రాండ్’ పేర్లతో ప్రత్యేక విభాగాలను కలిగి ఉంది. లులు మాల్లో రిటెయిల్, ఆహారం, వినోదం తదితర సేవలు పొందవచ్చు. ఫుడ్ కోర్ట్ ఆరు రెస్టారెంట్లతో పాటు 500 సీటింగ్‌తో 15 బహుళ వంటకాల అవుట్లెట్లను ఈ మాల్ కలిగి ఉంది. ఈ మాల్లో 1000 కార్లు, 900 బైక్‌లకు సరిపడా పార్కింగ్ ఉంది.
లులు మాల్ కలిగిన ఆరో నగరం హైదరాబాద్
కొచ్చి, తిరువనంతపురం, బెంగళూరు, లక్నో, కోయింబత్తూర్ తర్వాత లులు గ్రూప్ ఉనికిని కలిగి ఉన్న ఆరో నగరంగా హైదరాబాద్‌కు గుర్తింపు దక్కింది. 22 దేశాలలో 255 కంటే ఎక్కువ హైపర్ మార్కెట్లు, 24 షాపింగ్ మాల్స్‌తో.. అహ్మదాబాద్, చెన్నై, శ్రీనగర్, గ్రేటర్ నోయిడా, వారణాసి మొదలైన నగరాల్లోని ఫుడ్ ప్రాసెసింగ్, రిటైల్ ప్రాజెక్ట్‌లలో పెట్టుబడులతో లులు గ్రూప్ దేశంలో వేగంగా విస్తరిస్తోంది. అహ్మదాబాద్, వారణాసి, బెంగుళూరు, చెన్నై, నోయిడాల్లో కొత్త డెస్టినేషన్ మాల్స్‌ను ప్లాన్ చేస్తోంది. లులు గ్రూప్ ప్రధాన కార్యాలయం యూఏఈలోని అబుదాబిలో ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్‌పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

