Lover Affair | నగరంలోని ఎల్బీనగర్ ఆర్టీసీ కాలనీలో ఆదివారం దారుణ ఘటన జరిగింది. ప్రేమోన్మాది ప్రియురాలితో పాటు ఆమె సోదరుడిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో ప్రాణాలతో తమ్ముడు మృతి చెందగా.. అక్క ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నది. నిందితుడిని స్థానికులు గదిలో బంధించగా.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం మేరకు.. నగరంలోని ఎల్బీనగర్లో సంఘవి, ఆమె సోదరుడు పృథ్వి ఉంటున్నారు. ఆదివారం ఓ యువకుడు ఇంట్లోకి చొరబడి దాడికి పాల్పడ్డాడు. తీవ్ర గాయాలతో బయటకు వచ్చిన ఇద్దరిని చుట్టుపక్కల వారు గమనించి.. వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిందితున్ని ఇంట్లోనే బంధించారు. సదరు నిందితుడిని శివకుమార్‌గా గుర్తించారు.
అయితే, ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణంగా తెలుస్తున్నది. కొంతకాలంగా శివకుమార్, సంఘవి ప్రేమించుకుంటున్నారని, పెళ్లి గురించి మాట్లాడేందుకు వచ్చాడు. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చాడని.. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో కోపోద్రిక్తుడైన శివకుమార్ వెంట తీసుకువచ్చిన కత్తితో దాడికి పాల్పడ్డాడు. సంఘటనా జరిగిన సమయంలోనే సంఘవి సోదరుడు పృథ్వి ఇంట్లోనే ఉండగా.. అడ్డుకునేందుకు ప్రయత్నించగా.. అతనిపై సైతం దాడి చేశాడు. ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. సంఘవి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నది. రామంతాపూర్ కాలేజీలో సంఘవి హోమియోపతి చదువుతుండగా.. పృథ్వి బీటెక్ పూర్తి చేశాడు.