సిటీబ్యూరో: హోలీ సందర్భంగా ట్రై కమిషనరేట్ పరిధిలో ఈ నెల 14 ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసివేయాలని పోలీస్ కమిషనర్లు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే హోలీ రోజు బలవంతంగా రంగులు చల్లడం, రహదారులపై ప్రజలను ఇబ్బంది పెట్టడం వంటివి చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. కాగా, హోలీ సందర్భంగా బీఫ్ దుకాణాలను సైతం ఆ రోజు మూసివేయాలని నిర్వాహకులను బల్దియా అధికారులు ఆదేశించారు.