సిటీబ్యూరో, జూన్ 6 (నమస్తే తెలంగాణ): నైరుతి రుతుపవనాల ప్రభావంతో గురువారం గ్రేటర్‌లోని పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిశాయి. రాత్రి 9 గంటల వరకు ఖైరతాబాద్ సెస్స్ ప్రాంతంలో అత్యధికంగా 3.7 సెం.మీలు, కృష్ణానగర్‌లో 3.5, సికింద్రాబాద్ పాటిగడ్డలో 3.1, షేక్‌పేట, బన్సీలాల్‌పేటలో 3.0, ఫిల్మ్‌నగర్‌లో 2.4, గచ్చిబౌలి, బంజారాహిల్స్‌లో 2.2, హయత్‌నగర్, చందానగర్‌లో 1.9 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్‌డీపీఎస్ వెల్లడించింది. రుతుపవనాల ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్ వ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.