సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో పలు చోట్ల తేలికపాటి జల్లులు కురిశాయి. రాత్రి 8గంటల వరకు నగరంలోని షేక్‌పేటలో 1.43సెం.మీలు, శ్రీనగర్ కాలనీలో 1.0 సెం.మీలు, ఆర్.సి.పురంలో 8 మి.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీజీడీపీఎస్ అధికారులు వెల్లడించారు. రాగల 2రోజులు నగరంలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వానలు కురిసే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 35.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 26.2 డిగ్రీలు, గాలిలో తేమ 72 శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.