మణికొండ, ఏప్రిల్ 16 : ప్రముఖ సినీ నటుడు రాజ్ తరుణ, లావణ్య వివాద వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. నార్సింగి మున్సిపాలిటీ కోకాపేటలో తన కుమారుడు రాజ్ తరుణ్ కొనుగోలు చేసిన ఇంటిలో తాము ఉంటామంటూ బుధవారం ఆయన తల్లిదండ్రులు బసవరాజు, రాజేశ్వరిలు చేరుకున్నారు. అప్పటికే ఆ ఇంట్లో లావణ్య ఉంటున్న ఇంటికి రావద్దు అంటూ డోర్ మూయడంతో వారు ఇంటి ముందు ఆందోళన దిగారు. ఈ క్రమంలో స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ఇంట్లోకి వచ్చి తనను బలవంతంగా బయటకు నెట్టివేయాలని కుట్రలో భాగంగానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు ఇంట్లో ఉంటామని చెప్తున్నారంటూ లావణ్య ఆరోపిస్తున్నారు. మా ఇద్దరి మధ్య వ్యవహారం ఇంకా కోర్టులో కొనసాగుతుందని అప్పటివరకు తాను ఎట్టి పరిస్థితుల్లో ఇంట్లో నుంచి బయటకు వెళ్ళనని లావణ్య అంటున్నారు. కానీ తన కుమారుడు కొనుగోలు చేసిన ఈ ఇంటిలో తాము ఒక రూమ్ లో ఉంటామంటూ రాజ్ తరుణ్ తల్లిదండ్రులు పట్టుబట్టారు.
ఇంతటితో ఆగకుండా రాజ్ తరుణ్ తల్లిదండ్రులతో వచ్చిన కొంతమంది వ్యక్తులు సీసీ కెమెరాలను ధ్వంసం చేయడంతో ఆందోళన చోటుచేసుకుంది. తన ఇంట్లోకి మంచి బయటకు గెంటివేలన్న కుట్రలో భాగంగానే రాజ్ తరుణ్ తల్లిదండ్రులు తన ఇంట్లో ఉండేందుకు వస్తున్నారని ఆమె పోలీసుల ముందు వాపోయింది. తనకు ఎలాగైనా న్యాయం చేయాలంటూ పోలీసులను కోరింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపడుతున్నామని ఇన్స్పెక్టర్ హరికృష్ణ రెడ్డి తెలిపారు.