హైదరాబాద్ : ఈ నెల 18, 19వ తేదీల్లో హైటెక్స్ వేదికగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పో నిర్వహించనున్నారు. ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ఆధ్వర్యంలో నిర్వహించే ఈ ఎక్స్పోను ఐటీ, పరిశ్రమల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ ప్రారంభించనున్నారు. ఎక్స్పోలో 50 స్టాళ్లను ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ వాహనాల తయారీదారులు తమ తాజా ఉత్పత్తులు, పరికరాలతో పాటు ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహనాలను ప్రదర్శించనున్నారు. 5వేల మంది వరకు ఎక్స్పోను సందర్శించే అవకాశం ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు. ఆల్టియస్ ఆటో సొల్యూషన్స్ ఇప్పటి వరకు ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా, లక్నోలో 10కి పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎక్స్పోలను నిర్వహించింది.