చేవెళ్ల రూరల్ : శ్రీనివాస్ అఘోరి రిమాండ్ కథ ఎట్టకేలకు సుఖాంతమైంది. అఘోరి అవతారమెత్తిన శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. మోకిలా సీఐ వీరాబాబు కథనం ప్రకారం.. శ్రీనివాస్ అలియా స్ అఘోరి మాత (28) గతంలో చెన్నై, ఇండోర్లలో లింగ మార్పిడి శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఆధ్యాత్మిక దేవిగా ప్రచా రం చేసుకొని.. పూజలు, మంత్రాల పేరుతో ప్రజలను మోసం చేస్తూ ఆర్థికంగా లబ్ధి పొందుతున్నాడు. ప్రొద్దుటూరులో ఓ మహిళను దుష్టశక్తుల నుంచి రక్షించేందుకు తంత్ర పూజలు చేయాలని నమ్మబలికి రూ. లక్షలు వసూలు చేశాడు.
తాంత్రిక శక్తులతో ఆమెను చంపేస్తానని హెచ్చరించాడు. భయపడిన బాధితురాలు పోలీసులను ఆశ్రయిం చింది. దీంతో అతడు యూపీకి వెళ్లగా అక్క డ అరెస్టు చేసి..నార్సింగి ఏసీపీ కార్యాల యానికి తీసుకొచ్చి విచారించారు. చేవెళ్ల ప్ర భుత్వ దవాఖానలో వైద్యపరీక్షలు చేయిం చి.. చేవెళ్ల కోర్టులో న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. విచారించిన న్యాయమూ ర్తి నిందితుడికి 14 రోజుల రిమాండ్ విధించారు. దీంతో పోలీసులు శ్రీనివాస్ అఘోరి ని కంది జైలుకు తరలించారు.
అక్కడి నుం చి మళ్లీ చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తీసుకువచ్చి, లింగ నిర్ధారణ పరీక్షలు చేయించారు. నిందితుడు ట్రాన్స్‌జెండర్‌గా నిర్ధారణ కావడంతో మెడికల్ రిపోర్ట్ తీసుకుని పోలీసులు మళ్లీ కోర్టుకు వెళ్లారు. వైద్యుల నివేదికను పరిశీలించిన న్యాయమూర్తి శ్రీనివాస్ అఘోరిని ట్రాన్స్జెండర్లకు ప్రత్యేక బ్యారక్‌లు ఉన్న చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశించారు. దీంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు ఎట్టకేలకు శ్రీనివాస్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. చేవెళ్ల కోర్టు ముందు మీడియాతో మాట్లాడిన అఘోరి తాను పోలీసులు, కోర్టుకు సహకరిస్తున్నానని చెప్పారు. చట్టం తన పని తాను చేసుకుపోతున్నదని స్పష్టం చేశారు.