ఓటు నమోదులో బీఆర్ఎస్ దూకుడు
మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది.
- గ్రాడ్యుయేట్ నమోదుకు విస్తృత సమావేశాలు
- ఒకవైపు కేటీఆర్.. పార్టీ ఎమ్మెల్యేలు దిశానిర్దేశం
- దరఖాస్తుల పంపిణీ, ఆన్లైన్లో ఎన్రోల్మెంట్
మహబూబ్ నగర్ -రంగారెడ్డి-హైదరాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రక్రియలో బీఆర్ఎస్ స్పీడ్ పెంచింది. ఒకవైపు సకాలంలో దరఖాస్తుల పరిశీలన పూర్తిచేయాలంటూ ఎన్నికల యంత్రాంగంపై ఒత్తిడి తెస్తూనే, మరోవైపు పార్టీ యంత్రాంగాన్ని క్షేత్రస్థాయిలో పరుగులు పెట్టిస్తుంది. నియోజకవర్గాల వారీగా రెండో విడత సమగ్ర సమీక్షా సమావేశాలకు పార్టీ అధిష్ఠానం శ్రీకారం చుట్టింది. వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గాల వారీగా సమీక్ష జరుపుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జిలు, ఎమ్మెల్యేలు డివిజన్ల వారీగా నాయకులతో ఓటరు నమోదు ప్రకియను ఉధృతం చేస్తున్నారు. ప్రతి నియోజకవర్గానికి నిర్దిష్ట సంఖ్యలో ఓట్లను నమోదు చేయించడమే లక్ష్యంగా నాయకులకు టార్గెట్లు విధిస్తున్నారు. గ్రాడ్యుయేట్ స్థానంపై తిరిగి గులాబీ జెండా ఎగరడమే కాకుండా లక్ష్యంగా కార్యాచరణ అమలు చేస్తున్నారు.

Krishnarao
సిటీబ్యూరో, అక్టోబరు 27 (నమస్తే తెలంగాణ):అధికార కాంగ్రెస్ వైఫల్యాలను పట్టభద్రుల వేదికగా ఎండగట్టడమే మన ప్రధాన వ్యూహంగా రెండో విడత సమావేశాలు విస్తృతంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం పలు నియోజకవర్గాల్లో విస్తృత స్థాయి సమావేశాలు నిర్వహించారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఇన్చార్జి శంభీపూర్ రాజు పాల్గొని శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఖైరతాబాద్‌లో మన్నె గోవర్ధన్ రెడ్డి కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేశారు.
ఓటు నమోదు ప్రక్రియను సులభతరం చేసేందుకు గులాబీ శ్రేణులు పకా ప్రణాళికతో ఓటరు నమోదు చేయించాలని చెప్పారు. ఈ క్రమంలోనే డివిజన్లు, వార్డుల వారీగా కార్యకర్తలను నియమించి అర్హులైన పట్టభద్రుల వివరాలు సేకరిస్తూ ‘ఫామ్-18’ దరఖాస్తులను నేరుగా అందిస్తున్నారు. డివిజన్ల వారీగా 2వేల దరఖాస్తుల పంపిణీ లక్ష్యంగా పెట్టుకోగా చాలా వరకు సగం మేర పంపిణీ పూర్తి చేశారు. సంబంధిత దరఖాస్తులతో పాటు డిగ్రీ సర్టిఫికెట్లు, ఆధార్, గెజిటెడ్ సంతకాలతో కూడిన కాపీలను సేకరించి తీసుకుంటున్నారు. పార్టీ కా్ంయపుకార్యాలయాలు, స్థానిక కేందాల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఆన్లైన్ డెస్ల ద్వారా అప్లికేషన్లను ఎన్నికల కమిషన్ పోర్టల్‌లో నమోదు
చేస్తున్నారు.
కాంగ్రెస్ వైఫల్యాలే అస్త్రాలు..

Vani
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీ నెరవేర్చలేదని, జాబ్ క్యాలెండర్ అమలులో నిరుద్యోగులను మోసం చేసిందని గులాబీ శ్రేణులు పట్టభద్రుల వద్ద తీవ్రస్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేండ్లు అవుతున్న సందర్భంగా ఆ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు, ఎన్నికల హామీల అమలులో వైఫల్యాలనే గులాబీ దండు ప్రధాన అస్త్రంగా మలుచుకుంది.
టీజీపీఎస్సీ ద్వారా ఉద్యోగాల భర్తీపై నెలకొన్న అనిశ్చితిని, అభ్యర్థుల ఆందోళనలను ప్రధానంగా ప్రస్తావిస్తూ నిరుద్యోగ గ్రాడ్యుయేట్లలో ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్లుగా మలుచుకునే ప్రయ త్నం చేస్తున్నాయి. ఏది ఏమైనా, గ్రాడ్యుయేట్ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఓటర్ల ఎన్రోల్ మెంట్లో ప్రత్యర్థి పార్టీల కంటే ఒకడుగు ముందే ఉండి, పట్టభద్రుల స్థానాల్లో ఆధిపత్యం చాటాలని గులాబీ దళం భావిస్తోంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

