Khaja Moinuddin | ఇటీవలే నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మాసబ్ ట్యాంక్‌లో అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ దుండగుల చేతిలో హత్యకు గురైన విషయం తెలిసిందే. కాగా హత్యకు గురైన అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
ఖాజా మొయినుద్దీన్ నివాసానికి వెళ్లిన కేటీఆర్ వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఖాజా మొయినుద్దీన్ కుమారుడు ఫర్హాన్‌తో మాట్లాడి ఘటనకు సంబంధించిన వివరాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేటీఆర్ వెంట ఉన్నారు.
పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి..
వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాటం..హైకోర్టు , సిటీ సివిల్ కోర్టులో న్యాయవాదిగా ఉన్న ఖాజా మొయినుద్దీన్ కబ్జాకు గురవుతున్న వక్ఫ్ బోర్డు భూముల రక్షణ కోసం పోరాడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన హత్య జరిగినట్లు పలువురు అనుమానిస్తున్నారు. ఖాజా మొయినుద్దీన్ కేసు దర్యాప్తు చేయడం కోసం సిట్ ఏర్పాటు చేయాలని కోరుతూ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ డీజీపీ సీవీ ఆనంద్‌కు లేఖ కూడా రాసింది.
ఇదిలా ఉంటే అడ్వకేట్ ఖాజా మొయినుద్దీన్ పక్కా ప్లాన్ ప్రకారం రెక్కీ చేసి హత్య చేసినట్టుగా పోలీసులు నిర్దారణకు వచ్చారు. సీసీ టీవీ పుటేజీ ఆధారంగా నలుగురు దుండగులు ఖాజా మొయినుద్దీన్ ఇంటి సమీపంలో ఉదయం నుంచి మాటు వేసి నెంబర్ ప్లేట్ లేని స్కార్పియో కారుతో గుద్ది హత్య చేసినట్టు గుర్తించారు.
BRS Working President @KTRBRS visited the grieving family of advocate Khaja Moizuddin, who was brutally murdered in Masab Tank.
KTR conveyed his heartfelt condolences to the bereaved family and assured them of his support during this difficult time.
BRS General Secretary… pic.twitter.com/g51GoXiplp
— BRS Party (@BRSparty) May 30, 2026
This Weekend OTT | ‘జెట్ లీ’, ‘కర’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన వెబ్ సిరీస్‌లు, సినిమాలివే!
Rajamouli | ‘వారణాసి’కి మళ్లీ లీకుల బెడద.. జక్కన్న మౌనం వెనుక అసలు వ్యూహం ఏంటి?
Transgender Influencer: మున్నిపల్ ఎన్నికల్లో గెలిచిన ట్రాన్స్‌జెండర్ ఇన్ఫ్లూయెన్సర్