హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ( KTR ) హైదరాబాద్ లోని శంషాబాద్ పోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ లో జరిగిన వివాహా వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. మాజీమంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి (Jagadishwar Reddy) సోదరుడు గుంటకండ్ల సురేష్ రెడ్డి కుమార్తె డాక్టర్ రమద – డాక్టర్ భీమేష్ రెడ్డి ల వివాహ వేడుక ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, మాజీ కార్పొరేషన్ చైర్మన్లు, నాయకులు గాదరి కిషోర్ కుమార్, కంచర్ల భూపాల్ రెడ్డి, తిప్పన విజయసింహా రెడ్డి, నోముల భగత్ పాల్గొన్నారు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు ఫైళ్ల శేఖర్ రెడ్డి, రవీందర్ నాయక్, చిరుమర్ధి లింగయ్య, కంచర్ల కృష్ణారెడ్డి, తక్కెళ్లపల్లి రవీందర్ రావు, కర్నె ప్రభాకర్ లతో పాటు పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు, నాయకులు హాజరై నూతన వధువరులను ఆశీర్వదించారు.