పాలకుడు..ప్రజలను గౌరవించాలి. వారి అవసరాలను గుర్తించాలి. ఆపదలో ఆదుకోవాలి. అంతేగానీ పన్నుల రూపంలో ప్రజలపై భారం పెంచొద్దు. ప్రజల మనసెరిగిన నాయకుడిగా ముఖ్యమంత్రికి కేసీఆర్‌కు మంచి గుర్తింపు ఉంది. పాలనలో తన మార్క్ చూపిస్తూ, ప్రజల అవసరాలకు అనుగుణంగానే పథకాలు రూపొందించి ప్రశంసలు అందుకున్నాడు. అడగకుండానే అంగన్వాడీలకు జీతాలు పెంచి అందరివాడయ్యాడు. ఇలాంటి నాయకుడు దేశ్ కీ నేత కావాలని అంగన్వాడీలు కోరుకుంటున్నారు. సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే మాలాంటి కుటుంబాలకు మేలు జరుగుతుందని, పేదలు బాగుపడుతారని భగవంతున్ని ప్రార్థిస్తున్నారు. దేశ గతి మారాలంటే సీఎం కేసీఆర్ రావాల్సిందేనని అంగన్వాడీలు ఆకాంక్షిస్తున్నారు.
– నమస్తే తెలంగాణ,నెట్వర్క్
అందరికీ మేలు
సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే అందరికీ మేలు జరుగుతుంది. రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు పథకాలు అమలు చేస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఏ రాష్ట్రంలో లేనివిధంగా అంగన్వాడీ కార్మికులకు అధిక వేతనాలు ఇవ్వడంతో మా కుటుంబాలు సంతోషంగా ఉన్నాయి.
-స్వరూప, బొల్లారం
దేశ్‌కీ నేత కేసీఆర్
సీఎం కేసీఆర్ ఆలోచనలు తెలంగాణకే పరిమితం కావొద్దు. ఆయన పాలనా సామర్థ్యం, పకడ్బందీ సంక్షేమ పథకాలు దేశం దృష్టిని ఆకర్షించాయి. ఇంతటి ప్రజాదరణ ఉన్న కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి రావటం ద్వారా దేశ్ కీ నేతగా మారాలి. తద్వారా ఎన్నో రాష్ర్టాలకు ఆదర్శంగా ఉన్న పథకాలు దేశవ్యాప్తంగా ఆచరణకు నోచుకుంటాయి. కోట్లాది మందికి లబ్ధి లభించి మెరుగైన జీవితాలను పొందగలుగుతారు.
– ఘంటికోట ధనలక్ష్మి, అంగన్ వాడీ టీచర్, మియాపూర్
భగవంతున్ని ప్రార్థిస్తున్నా..
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రధాని కావాలని కోరుకుంటున్నా. ఇటీవల జాతీయ రాజకీయాలకు వెళ్తానని బహిరంగసభలో ప్రకటించినపుడు చాలా సంతోషించాను. అంగన్వాడీల కష్టాలను గుర్తించిన సీఎం కేసీఆర్ పీఎం అయితే అందరికీ లబ్ధిచేకూరుతుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చి ఎంతోమందికి మేలు చేయాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నా.
– సోమవరం పద్మావతి, అంగన్వాడి టీచర్, హనుమాన్ స్టోన్ కట్టర్స్, ఎస్పీఆర్ హిల్స్, రహ్మత్‌నగర్
మహిళల భద్రతకు భరోసా
సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశం అభివృద్ధి అవుతుంది. మహిళల భద్రతకు భరోసా ఉంటుంది. రాష్ట్రంలో శిశుమరణాలు తగ్గాయి. తల్లీబిడ్డలు క్షేమంగా ఉండటానికి అనేక పథకాలు తీసుకొచ్చారు. ఆడబిడ్డలకు కల్యాణ లక్ష్మి, షాదీముబారక్, ఆడబిడ్డ పుడితే రూ.13వేలు, కేసీఆర్ కిట్లు వంటి అనేక పథకాలు అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడ ఇలాంటి పథకాలు లేవు.. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశ వ్యాప్తంగా ఈ పథకాలు అమలు చేస్తారు.
– కే.భాగ్యరేఖ, ఐఎన్నగర్ సెంటర్3
విజన్ ఉన్న నాయకుడు
సీఎం కేసీఆర్ దూరదృష్టితో రాష్ర్టాన్ని అభివృద్ధి పరిచినట్లు దేశాన్ని కూడ ప్రగతిపథంలో నడిపిస్తారనే నమ్మకం ఉంది. దశాబ్దాలుగా ఉత్తరాది రాష్ర్టాల్లోని నాయకులే దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. జాతీయ స్థాయిలో కేసీఆర్ లాంటి విజన్ ఉన్న నాయకుడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే దేశం ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందుతుంది.
-పద్మ,బొల్లారం
అసలైన నాయకుడు
ప్రజలపై భారం మోపేవాడు నాయకుడు కాదు. ప్రజల అవసరాలను తీర్చేవాడే అసలైన నాయకుడు. సీఎం కేసీఆర్ రెండో కోవకు చెందుతారు. రాష్ట్రంలో ఆయన పరిపాలనలో అదే చేస్తున్నాడు. రాష్ర్టాలు అభివృద్ధి చెందితేనే దేశం అభివృద్ధి చెందుతుంది. తెలంగాణలోని పథకాలు అన్ని రాష్ర్టాలకు అందాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలి.
– జుమున, అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర్స్ కమిటీ జిల్లా కార్యదర్శి
అంగన్వాడీల్లో వెలుగులు
ముఖ్యమంత్రి కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వస్తే మాలాంటి ఎన్నో కుటుంబాలకు మేలు జరుగుతుంది. రూ. 1500లు ఉన్న మా జీతాన్ని రూ.13,500 కు పెంచిన ఘనత సార్‌దే. తెలంగాణతో పోల్చితే ఇతర రాష్ర్టాల్లోని అంగన్వాడీలు, చిన్న ఉద్యోగుల జీతాలు చాలా తక్కువ ఉన్నాయి. వారి కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు కేసీఆర్ సార్ కేంద్ర రాజకీయాల్లోకి రావాల్సిందే.
– ఎన్ నాగశ్రీలత, అంగన్వాడీ టీచర్, మార్తాండనగర్
దేశ రాజకీయాలకు అర్హుడు
ప్రస్తుతం దేశంలో రాజకీయ పరిస్థితులు అంతా అయోమయంగా మారాయి. ఈ సమయంలో అందరినీ కలుపుకుని వెళ్లే సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలకు రావడం ఎంతో అవసరం. అన్నీ రంగాల గురించి ఆలోచిస్తూ అందరికీ సంక్షేమం ఇస్తున్న సీఎం కేసీఆర్ దేశాన్ని తనదైన శైలిలో అభివృద్ధి చేయడానికి అర్హత ఉన్న వ్యక్తి.
– ప్రీతి, అంగన్వాడీ టీచర్, మల్లేపల్లి
కేసీఆర్‌కు ఎవరూ సాటిరారు
జాతీయ స్థాయిలో అన్నీ రాష్ర్టాల ముఖ్యమంత్రిల పని తీరును చూస్తే కేసీఆర్ గొప్ప సీఎం అని చెప్పవచ్చు. అందరి గురించి ఆలోచిస్తూ ప్రణాళికాబద్ధంగా రాష్ర్టాన్ని అభివృద్ధి పరుస్తున్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వస్తే ప్రజలకు మేలు జరగడం ఖాయం. అన్నీ వర్గాల ప్రజలను ఏకం చేయడంలో సీఎం కేసీఆర్‌కు ఎవరూ సాటి రారు.
– ప్రతిభ, అంగన్వాడీ టీచర్, సీతారాంబాగ్
పేదలకు మేలు
అంగన్వాడీ టీచర్లకు తెలంగాణ ప్రభుత్వం గౌరవమైన వేతనాలు ఇస్తుంది. పదిహేనేండ్లక్రితం అంగన్వాడీ టీచర్‌గా రూ.1400 వేతనం అందుకున్న. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడు రూ.13 వేలకుపైగా వేతనం వస్తుంది. కేసీఆర్ జాతీయ రాజకీయాలలోకి వస్తే అంగన్వాడీలకే కాదు.. ప్రతి పేద ఇంటికి మేలు జరుగుతుంది.
– ప్రమీల, అంగన్వాడీ టీచర్, రహ్మత్‌నగర్
దేశం పురోభివృద్ధి సాధిస్తుంది
ముఖ్యమంత్రి కేసీఆర్ అందరి సమస్యలు తెలిసిన నాయకుడు. ఆయన వల్ల తెలంగాణ అభివృద్ధిలో ముందుకు సాగుతుంది. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు అందరినీ ఆకర్శిస్తున్నాయి. కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి రావడం వల్ల దేశంలో మరిన్ని సంస్కరణలు అమలు జరుగుతాయి. దేశం మరింత పురోభివృద్ధి సాధిస్తుంది.
– హరిప్రియ, అంగన్వాడీ టీచర్, రామంతాపూర్
అంగన్వాడీలకు గౌరవం
కేంద్ర ప్రభుత్వం అంగన్ వాడీ టీచర్లపై పనిభారం పెంచుతుంది. ఇచ్చేది తక్కువ చెప్పుకునేది ఎక్కువ. గతంలో అంగన్ వాడీ టీచర్లకు వేతనాలు పెంచమంటే గుర్రాలతో తొక్కించిన సందర్భాలు చూశాం. వేతనాలు పెంచమని అడుగకుండానే సీఎం కేసీఆర్ వేతనాలు పెంచారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వస్తే దేశంలో ఉన్న అంగన్వాడీ టీచర్లకు మేలు జరుగుతుంది. అంగన్ వాడీ కార్యకర్తను అంగన్ వాడీ టీచర్‌గా గుర్తించి గౌరవం కల్పించారు.
– బి యశోద, అంగన్ వాడీ టీచర్, బడంగ్‌పేట
దేశంలో సుపరిపాలన వస్తుంది
బీజేపీ పాలనలో దేశంలో ప్రజల మధ్య అడ్డుగోడలు పెరిగాయి. కులం, మతం పేరుతో ప్రజలను విడదీస్తున్నారు. దేశంలో పాలన సాఫీగా సాగాలని, అందరూ కలిసి ఉండాలని కోరుకుంటున్నారు. అలాంటి పాలన రావాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిందే. ప్రజల మనిషిగా కేసీఆర్ మంచి పేరుంది. నిత్యం పేదల గురించి ఆలోచించే కేసీఆర్ కేంద్ర రాజకీయాల్లోకి వస్తే ఎంతో మందికి మేలు జరుగుతుంది.
– పి.మీనాక్షి, ఐఎన్నగర్ సెంటర్4
ప్రజల కష్టాలు తెలిసిన నాయకుడు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఎనిమిదేండ్ల క్రితం మా జీతాలు చాలా తక్కువ. మా బాధలు తెలుసుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్ అడగకుండానే జీతాలు పెంచారు. ఈ రోజు కుటుంబంతో సంతోషంగా గడుపుతున్నామంటే అది కేసీఆర్ చలువే. ఇలా ప్రజల బాధలు తెలిసిన గొప్ప నాయకుడు కేంద్ర రాజకీయాల్లోకి వస్తే ఇతర రాష్ర్టాల ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది.
– బీ శ్వేత, అంగన్వాడీ టీచర్, సుభాష్‌చంద్రబోస్‌నగర్