KCR : ఎంబీబీఎస్ విద్యార్థులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)చెక్కులు అందజేశారు. బీఆర్ఎస్ఎల్పీ సమావేశం కోసం శనివారం నందినగర్‌లోని నివాసానికి చేరుకున్న గులాబీ బాస్.. ఉప్పల్ నియోజకవర్గ పరిధిలోని వైద్య విద్యనభ్యసించే విద్యార్థులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి 15 మంది వైద్య విద్యకు అయ్యే ఫీజును కేసీఆర్ చేతుల మీదుగా చెక్కుల రూపంలో ఇప్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, రాజ్యసభ మాజీ ఎంపీ సురేశ్ రెడ్డి పాల్గొన్నారు.
కేసీఆర్ చేతుల మీదుగా చెక్కులు అందుకున్న వైద్య విద్యార్థులు