KCR | మెట్రోపై కేసీఆర్ ముందుచూపు.. మూడు దశల్లో 414 కి.మీ మేర విస్తరించేలా ప్రణాళికలు
మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్యత హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు అప్పగించారు.
- రెండో దశలో 78 కి.మీ తోనే సరిపెట్టిన రేవంత్ సర్కారు
- కేసీఆర్ ప్రభుత్వం మెట్రో విస్తరణ ప్రతిపాదనలు
KCR | సిటీబ్యూరో : మెట్రో విస్తరణ విషయంలో గత సీఎం కేసీఆర్ ఎంతో ముందు చూపుతో వ్యవహరించారు. మొదటి దశలో పూర్తయిన 69 కి.మీ మెట్రో కారిడార్లను నగరం నలుమూలలా విస్తరించేలా.. రెండు, మూడు దశలకు సంబంధించిన ప్రణాళికలను రూపొందించే బాధ్యత హైదరాబాద్ మెట్రో రైలు సంస్థకు అప్పగించారు. మహానగరంలో పదేండ్లలో 414 కి.మీ మెట్రో నెట్‌వర్క్‌ను విస్తరించాలని నిర్ణయించారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మెట్రోపై నిర్లక్ష్యం చూపుతున్నది.
అందుకు నిదర్శనం కేవలం 78.4 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిపాదించిన మెట్రో మార్గాలను పూర్తిగా పక్కన పెట్టి పరిమిత మార్గాల్లోనే కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేస్తోంది. అందులోనూ 3 మెట్రో మార్గాలు భవిష్యత్ అవసరాలకు ఏమాత్రం సరిపోవని ఒకవైపు పట్టణ ప్రణాళిక నిపుణులు, మెట్రో అధికారులు చెబుతున్నా పట్టించుకోకుండా మెట్రో విస్తరణ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
రెండో దశ..
- రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి ఓఆర్ఆర్ మీదుగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వరకు 31 కి.మీ
- నాగోల్ నుంచి ఎల్బీనగర్ వరకు 5 కి.మీ
- బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ వరకు 24 కి.మీ
- పెండింగ్‌లో ఉన్న పాతనగర మెట్రో మార్గం 5.5 కి.మీ
- మొత్తం 4 మెట్రో కారిడార్లు కలిపి 67 కి.మీ మేర మెట్రోను విస్తరించాలని నిర్ణయించారు.
మూడో దశ… ప్యాకేజీ-1 (48 కి.మీ)
- బీహెచ్ఈఎల్- పటాన్చెరు-ఓఆర్ఆర్- ఇస్నాపూర్ 13 కి.మీ
- ఎల్బీ నగర్-హయత్‌నగర్-పెద్ద అంబర్‌పేట 13 కి.మీ
- ఓఆర్ఆర్ పటాన్చెరు ఇంటర్చేంజ్- కోకాపేట-ఓఆర్ఆర్ నార్సింగి ఇంటర్చేంజ్ 22 కి.మీ
ప్యాకేజీ-2 (94 కి.మీ) - శంషాబాద్ జంక్షన్ మెట్రో స్టేషన్-కొత్తూరు-షాద్‌నగర్ 28 కి.మీ
- శంషాబాద్ ఎయిర్‌పోర్టు స్టేషన్-తుక్కుగూడ- ఫార్మాసిటీ 26 కి.మీ
- ఓఆర్ఆర్ శంషాబాద్ ఇంటర్చేంజ్-ఓఆర్ఆర్ పెద్ద అంబర్‌పేట జంక్షన్ 40 కి.మీ ప్యాకేజీ-3 (78 కి.మీ)
- ఉప్పల్ ఎక్స్ రోడ్డు- ఘట్కేసర్-బీబీనగర్ 25 కి.మీ
- తార్నాక ఎక్స్ రోడ్డు – ఈసీఐఎల్ రోడ్డు 8 కి.మీ
- ఓఆర్ఆర్ పెద్ద అంబర్‌పేట జంక్షన్- ఘట్కేసర్- ఓఆర్ఆర్ మేడ్చల్ జంక్షన్ 45 కి.మీ ప్యాకేజీ-4
- డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్- జేబీఎస్ మెట్రో రైల్ స్టేషన్ నుంచి తూంకుంట వరకు 17 కి.మీ
- డబుల్ ఎలివేటెడ్ ఫ్లై ఓవర్- ప్యారడైజ్ ఎక్స్ మెట్రో స్టేషన్ నుంచి మేడ్చల్-కండ్లకోయ జంక్షన్ వరకు 12 కి.మీ
- ఓఆర్ఆర్ మేడ్చల్ ఇంటర్చేజ్-దుండిగల్- ఓఆర్ఆర్ పటాన్చెరు ఇంటర్చేంజ్ 29 కి.మీ
రేవంత్ సర్కారు కొత్తగా చేపట్టిన మెట్రో రెండో దశ
- నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయణగుట్ట ,మైలార్‌దేవ్‌పల్లి మీదుగా శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు 33 కి.మీ
- మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు 14 కి.మీ
- రాయదుర్గం మెట్రో స్టేషన్ నుంచి కోకాపేట నియోపోలిస్ లేఅవుట్ వరకు 11.3 కి.మీ
- ఎల్బీనగర్ నుంచి హయత్‌నగర్ వరకు 8కి.మీ
- ఎంజీబీఎస్ నుంచి ఫలక్‌నుమా మీదుగా చాంద్రాయణగుట్ట ఇన్నర్ రింగు రోడ్డు వరకు 7 కి.మీ
- మైలార్‌దేవ్‌పల్లి నుంచి ఆరాంఘర్ మీదుగా కొత్తగా నిర్మించే హైకోర్టు భవనం వరకు 5 కి.మీ
- రెండో దశలో మొత్తం 78.4 కి.మీ మెట్రో మార్గాన్ని నిర్మించేందుకు రూ.24042 కోట్ల వ్యయం అవుతుందని అంచనాతో పనులు మొదలు పెట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

