చిక్కడపల్లి, మే 22: హైదరాబాద్ బుక్ ఫెయిర్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా కవి యాకుబ్, ఆర్. వాసు ఎన్నికయ్యారు. హైదరాబాద్ బుక్ ఫెయిర్ జనరల్ బాడీ సమావేశాన్ని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. ఈ సమావేశంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులతో పాటు ఉపాధ్యక్షులుగా శోభన్ బాబు, మలుపు బాల్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా సూరిబాబు, సురేశ్, కోశాధికారిగా నారాయణరెడ్డి ఎన్నికయ్యారు.