చిక్కడపల్లి : తెలంగాణ హౌస్ ఫెడ్ డైరెక్టర్ ఎ.కిషన్ రావు ఆధ్వర్యంలో బాగ్లింగంపల్లి చౌరస్తాలో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ముఠా గోపాల్ హాజరై కేక్ కట్ చేశారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం నాయకుడు ముఠా జయసింహ, వెంకటకృష్ణ(బబ్లు),రాంనగర్ డివిజన్ టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, ప్రధాన కార్యదర్శి మన్నే దామోదర్ రెడ్డి,రాజేంద్ర ప్రసాద్ గౌడ్, ముచ్చకుర్తి ప్రభాకర్, శివకుమార్ యాదవ్, టీవీ రాజు, సంతోష్ గౌడ్, కూరగాయల శ్రీను, ముఠా శివసింహ,కల్యాణ నాయక్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కందూరి కృష్ణ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదినం సందర్భంగా ఆదివారం చిక్కడపల్లి లో పేదలకు అల్పాహారం,పండ్లు పంపిణీ నిర్వహించారు. కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ముఠా గోపాల్ ప్రారంభించారు.
యువజన విభాగం నాయకుడు ముఠా జయసిహ, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు ఆర్.మోజస్, నాగభూషణం, శివకుమార్ యాదవ్, ముచ్చకుర్తి ప్రభాకర్, జనార్ధన్, మల్లేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.