మారేడ్‌పల్లి/బొల్లారం: రాజీవ్ రహదారి రోడ్డును 200 అడుగులకు విస్తరించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజీవ్ రహదారి ఆస్తుల యజమానుల జాయింట్ యాక్షన్ కమిటీ (జేఏసీ) కన్వీనర్ సతీశ్ గుప్తా ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ సికింద్రాబాద్ క్లబ్ నుంచి తిరుమలగిరి క్రాస్ రోడ్డు వరకు కొనసాగింది.
ఈ సందర్భంగా సతీశ్ గుప్తా మాట్లాడుతూ…ప్రభుత్వం తన నిర్ణయాన్ని పున:పరిశీలించాలని, ప్రతిపాదిత రహదారి విస్తరణను 200 అడుగుల నుంచి 100 అడుగులకు తగ్గించాలన్నారు.జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, హిమాయత్‌నగర్, బేగంపేట, అబిడ్స్, నాంపల్లి వంటి అనేక ప్రధాన ప్రాంతాలు 100 అడుగుల రోడ్లతో సమర్థవంతంగా ఉన్నాయని తెలిపారు. రాజీవ్ రహదారి మార్గంలో ఫ్లైఓవర్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 100 అడుగులు సరిపోతాయని పేర్కొన్నారు. అభివృద్ధికి వ్యతిరేకం కాదన్నారు.