IICT | సిటీబ్యూరో, సెప్టెంబర్ 9(నమస్తే తెలంగాణ) : ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీలో పలు ఉద్యోగ అవకాశాలకు నోటిఫికేషన్ జారీ చేశారు. వాక్ ఇన్ విధానంలో భర్తీ చేయనున్నారు.
ఎమ్మెస్సీ, ఎం ఫార్మా, బీటెక్, బీటెక్ ఎన్విరాన్మెంట్ ఇంజినీర్ పట్టభద్రులు అర్హులని, సెప్టెంబర్ 10న ఐఐసీటీ క్యాంపస్ ప్రాంగణంలో నిర్వహించే ఇంటర్వ్యూలకు హాజరు కావాల్సిందిగా అధికారులు తెలిపారు. సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్, సైంటిఫిక్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. వివరాలకు ఐఐసీటీ కెరీర్ వెబ్సైట్ను సంప్రదించాలని కోరారు.