
కేపీహెచ్‌బీ కాలనీ, జూన్ 21 : సమాజం ఎదుర్కొంటున్న సవాళ్లను, సమస్యలను పరిష్కరించే దిశగా పరిశోధనలు పెంచాలని జేఎన్టీయూహెచ్ వైస్ చాన్స్‌లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. సోమవారం వర్సిటీలో 2020-21 అప్లియేషన్ ప్రాసెస్‌లో భాగంగా వర్చువల్ మోడ్‌లో వర్సిటీ అనుబంధ కళాశాలల నిర్వాహకులు, ప్రిన్సిపాల్స్, డైరెక్టర్లతో సంభాషించారు. ఈనెల 21 నుంచి 30 వరకు ఆయా కళాశాలల అక్రిడియేషన్ స్థితి, నియామకాలు, ఉత్తమ సాధన అమలుపై చర్చించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో రెక్టార్ గోవర్దన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, అకాడమిక్ సెల్, అకాడమిక్ అండ్ ప్లానింగ్ అండ్ ఎవాల్యూయేషన్ డైరెక్టర్లు పాల్గొన్నారు.