హైదరాబాద్: హైదరాబాద్లో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. నగరంలోని 8 చోట్ల ఏక కాలంలో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. మంగళవారం తెల్లవారుజాము నుంచి బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కొండాపూర్, గచ్చిబౌలి సహా పలు ప్రాంతాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి.