సుల్తాన్‌బజార్ : నేటి సమాజంలో ఆత్మవిశ్వాసం, ధైర్యం, క్రమశిక్షణతో మహిళలు అన్నిరంగాలలో పురుషులతో సమానంగా ముందుకు దూసుకుపోవడం అభినందనీయమని తెలంగాణ మహిళా కమిషన్ చైర్మన్ సునీతా లక్ష్మారెడ్డి పేర్కొన్నారు.
ఈ మేరకు గురువారం మాసబ్‌ట్యాంక్‌లోని యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ సైన్స్, పీజీ సైఫాబాద్ కళాశాలలో ఫిజిక్స్ విభాగాధిపతి డాక్టర్ కె సాధన ఆధ్వర్యంలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలకు ఆమె ముఖ్య అతిధిగా విచ్చేసి మాట్లాడుతూ ప్రస్తుతం విద్యా రంగంలో విద్యార్థినీలే ముందుండటం ప్రశంసనీయమన్నారు.
నేటి మహిళలు ఎంతో ధైర్యం తో విశ్వాంతారాలంలో కూడా అడుగులు వేయడం సంతోషించదగ్గ విషయమన్నారు.మహిళా కమిషన్ ఎల్లవేళలా మహిళలపై జరుగుతున్న దాడులు, అఘాయిత్యాలపై చర్యలు తీసుకోవడంలో ముందుంటుం దని విద్యార్థినులకు అవగాహన కల్పించారు.
యూజీసీ డెవలప్మెంట్ సభ్యులు (హూమన్ రిసోర్స్) ప్రొఫె సర్ లావణ్య మాట్లాడుతూ విద్యార్థినీలు,మహిళలు అభివృద్ధిలో ఎదురవుతున్న అవరోధాల్ని చేధించి ఉన్నతంగా ఎదగాలని అన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జే లక్ష్మణ్‌నాయక్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేయడం అభినందనీయమన్నారు.
సమాజంలో ఫురుషులతో సమానంగా ఇంటా,బయట మహిళలు తమ కర్తవ్యాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు.మహిళా బంధు పేరిట మహిళా దినోత్సవ కార్యక్రమాలను నిర్వహించడం పట్ల ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రా ధాన్యతకు నిదర్శనంగా పేర్కొనవచ్చన్నారు.విద్యార్థినులు విద్యారంగంలో ముందుకు సాగడానికి అన్ని రకాల ప్రోత్సాహం అందిస్తామని అన్నారు.
ఈ కార్యకమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ లక్ష్మీ భవా ని, ఐక్యూఏసీ సమన్వయకర్త, ఫిజిక్స్ విభాగం హెచ్‌వోడి డాక్టర్ సాధన, మహిళా కమిటి సభ్యురాలు డాక్ట ర్ నివేదితతో పాటు భోధన, భోదనేతర సిబ్బంది, అధ్యాపకులు, విద్యార్థినీలు పాల్గొన్నారు.ఈ సంధర్భంగా విజేతలకు బహుమతులు అంద జేశారు.