శేరిలింగంపల్లి, జూలై 7: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రదాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ను గచ్చిబౌలిలోని ఇంజినీరింగ్ కళాశాల(ఇస్కీ) డైరెక్టర్ రామేశ్వర్ రావు గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇంజినీరింగ్ కళాశాలలో నిరంతరం కొనసాగుతున్న వృత్తిపరమైన శిక్షణ కార్యక్రమాలు, జల్ జీవన్ మిషన్ కోసం కీలక వనరుల కేంద్రం, థర్డ్ పార్టీ నాణ్యత నియంత్రణ, డీపీఆర్ తయారీ, నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాల వివరాలు చర్చించారు. సెప్టెంబర్ 22 నుంచి 24 వరకు ఇంజినీరింగ్ కళాశాలలో ఎక్స్ ఫో ఇన్ ైక్లెమట్ చేంజ్ ఇంపాక్ట్ ఇన్ ఎకోసిస్టిమ్ అంతర్జాతీయ సదస్సుకు ముఖ్యఅతిథిగా హాజరవ్వాలని అహ్వానించడం జరిగిందని రామేశ్వర్ రావు ఈ సందర్భంగా ఒక ప్రకటనలో తెలిపారు.