సిటీబ్యూరో, జూన్ 3 (నమస్తే తెలంగాణ): ప్రజలకు పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేయాలని మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సమతి సూచించారు. ఇటీవల మల్కాజిగిరి పోలీస్ కమిసనర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆమె సోమవారం కీసర పోలీస్‌స్టేషన్‌ను , మంగళవారం మార్కెట్ పోలీస్ స్టేషన్‌ను సందర్శించి సిబ్బంది పనితీరు గూర్చి ఆరా తీశారు. అలాగే ఉప్పల్, మల్కాజిగిరి జోన్లలో ఇటీవల పోలీసుల వ్యవహార శైలిపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయా జోన్లలోని పోలీస్ అధికారులతో సీపీ వరుస సమీక్షలు నిర్వహించినట్లు తెలిసింది. క్షేత్ర స్థాయిలో పోలీసింగ్ పటిష్టంగా ఉండేలా అధికారుల పర్యవేక్షణ ఉండాలని, నేరాలు జరగకుండా పకడ్బందీగా పెట్రోలింగ్ నిర్వహించాలంటూ సూచనలు చేస్తున్నారు.
కమిషనర్‌గా బాధ్యతలు చేపట్టిన తరువాత ఆమె అర్ధరాత్రి వేళల్లో దిల్‌సుఖ్‌నగర్‌లో ఒంటరిగా తిరుగుతూ అడ్డదారులు తొక్కుతున్న యువతను క్రమశిక్షనలో పెట్టేందుకు చర్యలు చేపట్టారు. హాస్టల్స్ ఎక్కువగా ఉండటంతో అదే ప్రాంతంలో సమావేశం ఏర్పాటు చేసి యువతకు హితబోధ చేశారు. అలాగే ఆయా ప్రాంతాలలో ఉన్న హాస్టల్స్‌లో ఉండే వారి జాబితాను తయారు చేసి, రికార్డులు పక్కాగా నిర్వహించాలని తగిన సూచనలు చేయడంతో క్షేత్ర స్థాయిలోని పోలీసులు డేటాను సేకరించారు. ఇలా క్షేత్ర స్థాయిలో ఉన్న లోపాలను సరిదిద్దుతూ, పోలీసింగ్‌ను పటిష్టం చేసేందుకు చర్యలు తీసుకంటున్నారు.

Malkajigiri Police Commissi