Inter Exams | హయత్ నగర్ , మార్చి 9: పరీక్షల భయంతో ఇంటర్ విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. పల్నాడు జిల్లా, సావల్య పురం మండలం, గంటవారిపాలెంకు చెందిన కర్ణ శ్రీనివాసరావు కుటుంబ సభ్యులతో కలిసి హయత్ నగర్ లోని లెక్చరర్స్ కాలనీ నివాసముంటున్నారు.
ఆయన కుమార్తె కర్ణ వెంకటసాయి ప్రీతి(17), ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నది. ప్రస్తుతం ఇంటర్ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఇంటర్ పరీక్షల భయాందోళనకు గురైన వెంకట సాయి ప్రీతి ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చురీకి తరలించారు. తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.