CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఇందిరా గాంధీ నేషనల్ ఫారెస్ట్ అకాడమీ(IGNFA), డెహ్రాడూన్ డైరెక్టర్ భరత్జ్యోతి ప్రశంసించారు. ములుగులో ఫారెస్ట్ కాలేజ్, రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటులో ఉన్న కేసీఆర్ విజన్‌ను మెచ్చుకున్నారు. ఫారెస్ట్ డిగ్రీ కోర్సు కోసం ప్రత్యేక అకాడమీని ఏర్పాటు చేసిన సీఎం కేసీఆర్ విజన్‌కు అభినందనలు తెలిపారు. ఆయన ఇవాళ దూలపల్లిలో ఉన్న తెలంగాణ ఫారెస్ట్ అకాడమీని సందర్శించారు.

జాతీయస్థాయితో పాటు, వివిధ రాష్ట్రాల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్కు ఎంపికైన అధికారులు, ఉద్యోగులకు శిక్షణ ఇస్తున్న దూలపల్లి ఫారెస్ట్ అకాడమీలో సౌకర్యాలు, విద్యా బోధన, క్షేత్రస్థాయి శిక్షణ వంటి అంశాలను భరత్ జ్యోతి ఈసందర్భంగా పరిశీలించారు. తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ కార్యకలాపాలపై ఏర్పాటు చేసిన వీడియోను తిలకించారు.
ఈసందర్భంగా అకాడమీ డైరెక్టర్ రాజానారావు, డిప్యూటీ డైరెక్టర్‌తో సమావేశమై శిక్షణ పద్దతులపై ఆయన చర్చించారు. ఫారెస్ట్ అకాడమీలో విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అకాడమీలో కల్పిస్తున్న సౌకర్యాలను ప్రశంసించారు. అనంతరం ఫారెస్ట్ అకాడమీ ఆవరణలో భరత్జ్యోతి మొక్కలు నాటారు. ఈ ఈకార్యక్రమంలో సీఎం ఓఎస్డీ, అకాడమీ డీన్ ప్రియాంక వర్గీస్, డిప్యూటీ డైరెక్టర్ ఎ.నర్సింహరెడ్డి, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.