కొండాపూర్, జూలై 13 : భారతీయ సంస్కృతీ, సంప్రదాయాలపై ఉన్న మక్కువతో విదేశాల్లో ఉన్నప్పటికీ తనకు ఇష్టమైన కూచిపూడి నృత్యంలో ఎంతో మందికి శిక్షణనిస్తూ, నృత్యకారులుగా తీర్చిదిద్దుతున్న నాట్య గురువులు ప్రీతి తాతంబొట్ల మాదాపూర్లోని శిల్పారామంలో తమ శిష్య బృందంతో కలిసి ప్రత్యేక నృత్య ప్రదర్శనిచ్చారు.
శనివారం వారాంతపు సాంస్కృతి ప్రదర్శనల్లో భాగంగా శిష్య బృందంతో కలిసి వివిధ అంశాలపై ఇచ్చిన నృత్యప్రదర్శన విశేషంగా ఆకట్టుకున్నది.