సిటీబ్యూరో, మార్చి 13(నమస్తే తెలంగాణ) : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు లైఫ్ సైన్సెస్ సేవలు అందించడమే లక్ష్యంగా థర్మోఫిషర్(Thermofisher) సెంటర్‌ను ప్రారంభించారు. సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యూలార్ బయాలజీలోని అటల్ ఇంక్యుబేషన్ సెంటర్లో నిర్వహిస్తున్న స్టార్టప్‌లకు వీలుగా ఈ సెంటర్ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం హై ఎండ్ ఇమేజింగ్ టూల్స్‌గా పలు పరిశోధనలకు అవసరమైన టెక్నాలజీని అందించడంలో థర్మోఫిషర్ ముఖ్య భూమికను పోషిస్తోంది. ఈ క్రమంలో ఏఐసీలోనే సెంటర్‌ను నెలకొల్పడం వలన పరిశ్రమ అవసరాలకు సాయపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఎంబీ డైరెక్టర్ వినయ్ నందికూరి, ఏఐసీ సీఈవో మధుసూదన్ రావు, థర్మోఫిషర్ నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.