సిటీబ్యూరో, జూన్ 10 (నమస్తే తెలంగాణ): రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా ‘అరైవ్ అలైవ్’లో భాగంగా బుధవారం నేరేడ్మెట్లోని మల్కాజిగిరి సీపీ కార్యాలయంలో కమిషనర్ బి.సుమతి నేతృత్వంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్‌కృష్ణారెడ్డి, డీసీపీలు అనురాధ, మనోహర్ కలిసి రోడ్డు భద్రతా నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదానికి గురైన బాధితులకు గోల్డెన్ అవర్‌లో తక్షణ సహాయం అందించేందుకు నగర పౌరులు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
కమిషనరేట్ పరిధిలోని ఐదు ప్రధాన బ్లాక్ స్పాట్స్ కుంట్లూర్ టీ జంక్షన్, కొత్తగూడె ఎక్స రోడ్స్, బోయిన్పల్లి పోలీస్‌స్టేషన్ జంక్షన్, ఉప్పల్ ఎక్స్ రోడ్స్, రేతిఫైల్ బస్స్టాంగ్ సిగ్నల్ ప్రాంతాలలో ఆయా డీసీపీలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని వివరించారు. 2025లో 50 బ్లాక్ స్పాట్స్ గుర్తించామని, ఆయా బ్లాక్స్ స్పాట్లలో 342 ప్రమాదాలు జరుగా అందులో 232 మరణాలు జరిగాయన్నారు. విజయవాడ జాతీయ రహదారిపై ఈ ఏడాదిలో 259 ప్రమాదాలు జరుగగా అందులో 17 మంది మృతి చెందారని వివరించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు గోల్డెన్ హవర్లో బాధితులకు చికిత్స చేయించాలన్నారు. రోడ్డు ప్రమాదాల బాధితులకు తక్షణ సహాయం చేసిన వారికి రహవీర్ స్కీమ్ కింద రూ.25 వేల రివార్డు అందుతుందని, అలాగే ప్రమాద బాధితులకు పీఎం రథ్ స్కీమ్ కింద దవాఖానాలు రూ.1.5 లక్షల విలువైన క్యాష్‌లెస్ చికిత్స అందిస్తాయని తెలిపారు