HYDRAA | మల్కాజ్గిరి, జూన్ 5 : అల్వాల్ సర్కిల్ పరిధిలోని చిన్నరాయుడు చెరువులో అక్రమంగా నిర్మించిన మూడు భవనాలను హైడ్రా అధికారులు కూల్చి వేశారు. చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మాణాలు చేపట్టారని హైడ్రాధికారులకు స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులను స్వీకరించిన అధికారులు భవనాలను పరిశీలించి ఎఫ్టీఎల్ పరిధిలో అక్రమంగా నిర్మించినట్లు గుర్తించి కూల్చివేశారు. భవనాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తున్న సందర్భంగా భవన యజమానులు అధికారులతో వాదించారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు.