MLA Madhavaram Krishnarao | నన్ను చంపేయండి.. కానీ నా ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోను : ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు
MLA Madhavaram Krishnarao | నా మీద కోపముంటే నా ప్రజలకు అన్యాయం జరగొద్దు. రేవంత్ రెడ్డి సెక్షన్ 22ఏను తీసివేయకపోతే మా ప్రజలను ఇబ్బంది పెడితే, మా కాలనీవాసులను ఇబ్బందిపెడితే ఈ మాధవరం కృష్ణారావు ఊరుకునే వ్యక్తి కాదన్నారు.
MLA Madhavaram Krishnarao | 70 వేలకుపైగా ఓట్లతో నా ప్రజలు నన్ను గెలిపించారు. హైదరాబాద్లో నాది టాప్ మెజారిటీ అని కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. మీడియా సమావేశంలో మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. నా మీద పగ ఉంటే నన్ను చంపేయండి చస్తా.. నా నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేశారు. కానీ నా ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకునే ప్రసక్తే లేదని రేవంత్ సర్కార్ను హెచ్చరించారు.
ఒకటేమో హైదరాబాద్లో కలిపారు.. మరొకటి మల్కాజిగిరిలో కలిపారు.. ఇంకొకటేమో సైబరాబాద్లో కలిపారు. నేను మీ పార్టీలో జాయిన్ కాలేదు కదా.. నన్ను చంపేయండి చస్తా.. నా ప్రజలను కాపాడండి.. నా మీద కోపముంటే నా ప్రజలకు అన్యాయం జరగొద్దు. రేవంత్ రెడ్డి సెక్షన్ 22ఏను తీసివేయకపోతే మా ప్రజలను ఇబ్బంది పెడితే, మా కాలనీవాసులను ఇబ్బందిపెడితే ఈ మాధవరం కృష్ణారావు ఊరుకునే వ్యక్తి కాదన్నారు.
నా మీద పగ ఉంటే నన్నేమైనా చేయండి
కానీ నా ప్రజలను ఇబ్బంది పెడితే
ఊరుకునే ప్రసక్తే లేదు!– ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు 🔥@mkrkkpmla pic.twitter.com/kafBK5BVvK
— BRS Party (@BRSparty) August 26, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

