ఆక్రమణలపై 78 ఫిర్యాదులు..
ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు.
- అధికారులు మీ వద్దకే వచ్చి విచారిస్తారు..
- నాలుగు వారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే.. నేనే వచ్చి విచారిస్తా
- హైడ్రా ప్రజావాణి ఫిర్యాదులపై కమిషనర్ రంగనాథ్
సిటీబ్యూరో, జనవరి 27(నమస్తే తెలంగాణ): ఆయా ప్రాంతాల్లో జరిగే ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులకు సంబంధించి హైడ్రా అధికారులు ఆ ప్రాంతాల ప్రజల వద్దకే వచ్చి విచారిస్తారని, సంబంధిత పత్రాలను ఇచ్చి విచారణకు సహకరించాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ సూచించారు. బుద్ధభవన్‌లోని హైడ్రా కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజావాణిలో చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాలు, పార్కులకు సంబంధించి ఆక్రమణలపై 78 ఫిర్యాదులు వచ్చాయి. కమిషనర్ రంగనాథ్ స్వయంగా ఫిర్యాదుదారులతో మాట్లాడి.. వారి సమక్షంలోనే గూగుల్ మ్యాప్స్‌ను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చూపించి.. పూర్తి వివరాలు తెలుసుకున్నారు.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మండలం, ఐలాపూర్ గ్రామం సర్వే నంబర్ 119 నుంచి 220 వరకు ఉన్న 408 ఎకరాల్లో అక్రమంగా అమ్మకాలు జరుగుతున్నాయని, దీనిపై విచారణ జరిపించాలని గతంలో అక్కడ ఇంటి స్థలాలు కొన్నవారు ఫిర్యాదు చేశారు. అలాగే.. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండలం, కుంట్లూర్ పెద్ద చెరువులో 2 ఎకరాల స్థలాన్ని కబ్జా చేశారని, 59జీవో ప్రకారం రెగ్యులరైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ కొందరు స్థానికులు ఫిర్యాదు చేశారు.
నిజాంపేట మున్సిపాలిటీ పరిధిలోని మొదటి డివిజన్లో 2,900 గజాల పార్కును స్థానికులు కొందరు కబ్జా చేస్తున్నారని కేవీఆర్ రెయిన్బో కాలనీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. రంగారెడ్డి జిల్లా మన్సూరాబాద్ పెద్ద చెరువు ఎఫ్టీఎల్ పరిధిని పెంచి తమ ఇంటి స్థలాల్లో ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం లేదంటూ వాసవి గ్రాడ్యుయేట్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి తీసుకున్న ఫిర్యాదులను ఆయా ఏరియా అధికారులకు కేటాయించి.. ప్రజల సమక్షంలోనే విచారణ జరపాలని, స్థానిక అధికారుల నుంచి పూర్తి వివరాలు తీసుకుని లోతైన విచారణ చేయాలని ఆదేశించారు.
రెండువారాల్లో అధికారులు వచ్చి విచారణ చేపడతారంటూ వారి ఫోన్ నంబర్లను ఫిర్యాదుదారులకు కమిషనర్ ఇవ్వడమే కాకుండా నాలుగువారాల్లో సమస్య పరిష్కారం కాకుంటే తానే స్వయంగా వచ్చి విచారణ చేపడుతానంటూ తెలిపారు. సమగ్రంగా విచారణ జరిపించి కబ్జాదారులపై కేసులు పెట్టాలని, కబ్జాల చెర నుంచి కాపాడిన ప్రభుత్వ భూముల వద్ద ప్రొటెక్టెడ్ బై హైడ్రా అని బోర్డులు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. చెరువుల ఎఫ్టీఎల్ పరిధిలు పెరుగుతున్నాయన్న ఫిర్యాదులపై మ్యాపులను పరిశీలించాలని, ముందుగా అమీన్పూర్ చెరువు, దుర్గం చెరువు, మాసబ్ చెరువు, మన్సూరాబాద్ పెద్ద చెరువులను పరిశీలించాలని కమిషనర్ రంగనాథ్ అధికారులను ఆదేశించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijayasai Reddy | వైఎస్ జగన్‌ను వదిలి వెళ్లలేదు..వెళ్లేలా కొందరు చేశారు : విజయసాయిరెడ్డి
భాగ్యశ్రీ బోర్సే వయ్యారాల విందు.. హాట్ హాట్ ఫొటోలతో ఇంటర్నెట్లో రచ్చ!
Centre earns Rs 970 crore from scrap | నెల రోజుల పాటు వ్యర్థాల తొలగింపు.. ఆరో విడతలో కేంద్రానికి రూ. 970 కోట్ల ఆదాయం
IKP Centers | ఐకేపీ ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
Surprise Inspections | కొత్తగూడెంలో తూనికలు, కొలతల శాఖ ఆకస్మిక తనిఖీలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

