తెలుగు యూనివర్సిటీ , నవంబర్ 13 : శాస్త్రీయ నృత్య కళను భావితరాలకు అందించాలని ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచన కర్త డాక్టర్ అనంతలక్ష్మి అన్నారు. భారతీయ సంస్కృతి, సనాతన ధర్మం పరిఢవిల్లడానికి శాస్త్రీయ నృత్యం దోహదపడుతుందని అనంతలక్ష్మి తెలిపారు. ఆదివారం పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో విజయ మాధవి సేవా సంస్కృతిక అకాడమీ ఆధ్వర్యంలో కార్త్తిక మాస నృత్య మహోత్సవం ఘనంగా జరిగింది.
ఈ సందర్భంగా పలువురు కళాకారిణిలు శాస్త్రీయ నృత్యాలను వేదికపై ప్రదర్శించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతలక్ష్మి నృత్య గురువులు, కళాకారిణిలను సత్కరించారు. సమాజాన్ని చైతన్యపరుస్తున్న అనంతలక్ష్మిని నిర్వహకులు విజయమాధవి ఘనంగా సన్మానించారు.