కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 18 : కూకట్‌పల్లిలోని రంగధాముని (ఐడీఎల్) చెరువును ట్యాంక్‌బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం రంగధాముని (ఐడీఎల్) చెరువు అభివృద్ధి పనులను అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కూకట్పల్లి నడిబొడ్డునున్న రంగధాముని (ఐడీఎల్) చెరువును ఆహ్లాదకరంగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఈ చెరువు సుందరీకరణ కోసం వందకోట్లతో ప్రణాళికలు సిద్ధం చేయడం జరిగిందన్నారు. దీనిలో భాగంగా మొదటి విడతలో రూ.8 కోట్లు మంజూరు కాగా పనులు ప్రారభించినట్లు తెలిపారు. చెరువుగట్టుపై వాకింగ్ ట్రాక్, రెయిలింగ్, టాయిలెట్స్, కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులతో పాటు పచ్చని, ఆహ్లాదాన్నందించే మొక్కలు నాటనున్నట్లు తెలిపారు. ఈ చెరువుగట్టుపై అన్ని వయస్సుల వారు సేద తీరేలా, తీరిక సమయాల్లో సరదాగా చెరువుగట్టుపై గడిపేలా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. మరోవైపు చెరువులోకి మురుగునీరు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు.
రంగధాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తప్పకుండా న్యాయం చేస్తానని.. చెరువుగట్టుపై జరుగుతున్న అభివృద్ధి పనులకు సహకరించాలని కోరారు. రంగధాముని (ఐడీఎల్) చెరువుగట్టుపై చిరు వ్యాపారులను ఎమ్మెల్యే కృష్ణారావు కలిసి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చెరువుగట్టుపై ఎన్నో ఏళ్లుగా చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నామని.. చెరువు సుందరీకరణతో చిరు వ్యాపారులు రోడ్డున పడాల్సివస్తుందని ఎమ్మెల్యేకు మొరపెట్టుకున్నారు. ఈ విషయంపై ఎమ్మెల్యే కృష్ణారావు మాట్లాడుతూ.. రంగధాముని చెరువు అభివృద్ధి పనులకు ఆటంకం కలిగించొద్దని.. పనులు సజావుగా సాగేలా సహకరించాలని కోరారు. ప్రస్తుతానికి చెరువుగట్టు రోడ్డులో అవతలివైపు చిరు వ్యాపారాలు చేసుకోవాలని సూచించారు. పనులు పూర్తైన తర్వాత శాశ్వత పరిష్కారం చూపిస్తానని హామీనిచ్చారు. కార్యక్రమంలో కార్పొరేటర్ పగుడాల శిరీష, మాజీ కార్పొరేటర్లు బాబురావు, శ్రావణ్‌కుమార్, కూకట్పల్లి నర్సింగరావు, హెచ్ఎండీఏ ఏఈ జీవన్‌రెడ్డి తదితరులున్నారు.