హైదరాబాద్ అబ్బాయికి ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కారం
Virat Chandra | ఏడేండ్ల వయసులోనే కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ అబ్బాయికి ప్రధాన మంత్రి రాష్ట్రీల బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం

హైదరాబాద్ : ఏడేండ్ల వయసులోనే కిలిమంజారో పర్వత శిఖరాన్ని అధిరోహించిన హైదరాబాద్ అబ్బాయికి ప్రధాన మంత్రి రాష్ట్రీల బాల పురస్కార్ అవార్డు వరించింది. సోమవారం మధ్యాహ్నం వర్చువల్ విధానంలో జరిగిన సమావేశంలో తేలుకుంట విరాట్ చంద్రకు ప్రధాని మోదీ ఈ అవార్డును అందజేశారు.
హైదరాబాద్ తిరుమలగిరికి చెందిన తేలుకుంట విరాట్ చంద్ర(8) మూడో తరగతి చదువుతున్నాడు. కఠోర శిక్షణ అనంతరం గతేడాది మార్చిలో దక్షిణాఫ్రికాలోని అత్యంత ఎత్తైన పర్వత శిఖరం కిలిమంజారోను అధిరోహించి ఔరా అనిపించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను సైతం లెక్కచేయకుండా విరాట్ కిలిమంజారో పర్వతాన్ని ఎక్కడం విశేషం.

మొత్తం ఆరు విభాగాలలో(ఇన్నోవేషన్, సోషల్ సర్వీస్, స్పోర్ట్స్, ఆర్ట్ అండ్ కల్చర్ ,ధైర్యసాహసాలు, స్కూల్ అండ్ ఎడ్యుకేష్ కి సంబంధించిన) అసాధారణ విజయాలు సాధించిన పిల్లలకు భారత ప్రభుత్వం ప్రతి ఏటా ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డును అందజేస్తోంది. బాల శక్తి పురస్కారం యొక్క వివిధ కేటగిరీల కింద ఈ ఏడాది దేశవ్యాప్తంగా మొత్తం 29 మంది పిల్లలు ఈ అవార్డులకు ఎంపికయ్యారు. ప్రతి అవార్డు గ్రహీతకు పతకం, నగదు బహుమతి రూ. 1 లక్షతో పాటు సర్టిఫికేట్ ను అందజేస్తారు. నగదు బహుమతిని అవార్డు గ్రహీతల సంబంధిత బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు.
💠#Hyderabad కు చెందిన తేలుకుంట విరాట్ చంద్ర.. వయసు 7 ఏళ్లు.
— PIB in Telangana 🇮🇳 (@PIBHyderabad) January 24, 2022
💠ఆఫ్రికాలో అత్యంత ఎత్తైన పర్వతం కిలిమంజారో ప్రతికూల వాతావరణ పరిస్థితులు లెక్కచేయకుండా అధిరోహించాడు.
💠నేడు ప్రధానమంత్రి @narendramodi చేతుల మీదుగా రాష్ట్రీయ బాల పురస్కారాన్ని పొందాడు. pic.twitter.com/zbLZOrSLo2
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

