చాంద్రాయణ గుట్ట ఫిబ్రవరి 26: నెహ్రూ జూపార్కులో మార్చి 1 నుంచి ఎంట్రీ టికెట్ ధరలు పెరగనున్నాయి. పెద్దలకు 100 రూపాయలు, పిల్లలకు 50 రూపాయలు ఫీజు వసూలు చేయనున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ పార్కులు, పార్కుల అథారిటీ 13వ జనరల్ బాడీ సమావేశంలో ఈ ధరల పెంపు నిర్ణయం తీసుకున్నట్టు జూపార్కు అధికారులు తెలిపారు.
సినిమా షూటింగ్కు సంబంధించిన కెమెరాలకు 10 వేల రూపాయలు ఫీజు తీసుకోనున్నారు. ప్రొఫెషనల్ వీడియో కెమెరాకు 2500 రూపాయలను ఫీజుగా తీసుకుంటారు. 14 సీటర్ల బ్యాటరీ వాహనాన్ని సందర్శకులకు మార్చి 1 నుంచి అందుబాటులోకి తే నున్నారు. దీనికి గంటకు 4000 రూపాయలను ఫీజు వసూలు చేస్తారు. 11 సీట్ల బ్యాటరీ వాహనానికి 3 వేల రూపాయలను తీసుకుంటారు.