కమ్యూనిటీల్లో నీటి కటకట
మహానగరాన్ని తాగునీటి సమస్య చుట్టుముడుతున్నది. నగరంలో పరిస్థితులు ఇప్పటికే వేసవిని తలపిస్తు న్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురియకపోవడంతో నగరానికి నీళ్లు సరఫరా చేసే జలాశయాల్లోనూ నీటి మట్టాలు రోజురోజుకు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. నగరానికి రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి పెరగనుంది.
- పెరుగుతున్న మెయింటెనెన్స్ చార్జీలు
- చదరపు అడుగుకు రూ.4.50 పెంచేందుకు కసరత్తు
- నీటిని పొదుపు చేయాలంటూ నోటీసు బోర్డుల్లో హెచ్చరికలు
మహానగరాన్ని తాగునీటి సమస్య చుట్టుముడుతున్నది. నగరంలో పరిస్థితులు ఇప్పటికే వేసవిని తలపిస్తు న్నాయి. ఉష్ణోగ్రతలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. బోర్లు ఎండిపోతున్నాయి. ఎగువ ప్రాంతాల్లో వర్షాలు కురియకపోవడంతో నగరానికి నీళ్లు సరఫరా చేసే జలాశయాల్లోనూ నీటి మట్టాలు రోజురోజుకు డెడ్ స్టోరేజీకి చేరుకుంటున్నాయి. నగరానికి రాబోయే రోజుల్లో నీటి ఎద్దడి పెరగనుంది.
ఇప్పటికే సాధారణంగానే నీటి కొరత ఉండే కాలనీలు, బస్తీల ప్రజలకు ఇబ్బందులు మొదలయ్యాయి. దీంతో జలమండలి వినియోగదారులు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. సైబర్ సిటీ ప్రాంతం పరిస్థితి మరింత దారుణంగా మారుతున్నది. ఈ నేపథ్యంలో నీటిని ఎక్కువ మొత్తంలో వినియోగించే గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో పరిస్థితులు ప్రమాదకరంగా మారుతున్నాయి. జలమండలి నుంచి బల్క్ సరఫరా చేస్తున్నా బోర్లు ఎండిపోవడం వల్ల ఏమాత్రం సరిపోవడం లేదు. దీంతో వందలాది ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. ముఖ్యంగా శివారు ప్రాంతాలైన ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, సైబర్ సిటీ ప్రాంతాల్లో తీవ్రత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తున్నది. రానున్న రోజుల్లో గేటెడ్ కమ్యూనిటీలకు నీటి కటకట మరింత పెరిగే ప్రమాదమున్నది.
సిటీబ్యూరో, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): గేటెడ్ కమ్యూనిటీలు, అపార్ట్మెంట్లలో ఇప్పటికే నీటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కమ్యూనిటీల్లో అసోసియేషన్లు, కాలనీల అసోసియేషన్లు నివాసితులను అప్రమత్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో నీటి సమస్యలు తలెత్తనున్న నేపథ్యంలో పొదుపుగా వినియోగించాలని, లేదంటే మెయింటెనెన్స్ చార్జీలు భారీగా పెంచాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం పలు సొసైటీల్లో నీళ్ల కోసం ఒక చదరపు అడుగుకు రూ.3 రూపాయలు వసూలు చేస్తున్నారు. దీన్ని రూ.4.50కు పెంచేందుకు అసోసియేషన్లు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తున్నది. సొసైటీ గ్రూపుల్లో నిత్యం నోటీసులు ఇస్తున్నారు.
నీటి వృథాను అరికడుతూ, వినియోగం సాధ్యమైనంత వరకు తగ్గించుకోవాలని సూచనలు చేస్తున్నారు. ఇప్పటికే చాలా ప్రాంతాల్లో నీటి ఇబ్బందులు ప్రారంభమయ్యాయి. హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, రాయదుర్గం, మణికొండ, గబ్చిబౌలి, అమీన్పూర్, నల్లగండ్ల, కొల్లూరు, తెల్లాపూర్ ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీల నివాసితులు ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేస్తున్నారు. ఆయా కమ్యూనిటీల్లో బోర్లు ఎండిపోతుండటంతో ఆర్వో ప్లాంట్లకు ట్యాంకర్ల నీటిని తీసుకుని శుద్ధి చేయడం ప్రారంభించారు. రాబోయే రోజుల్లో ట్యాంకర్ల సంఖ్యను గణనీయంగా పెంచుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో ట్యాంకర్లకు భారీగా డిమాండ్ పెరుగుతున్నది. జలమండలి ట్యాంకర్లు సకాలంలో డెలివరీ చేయకపోవడంతో ప్రైవేట్ ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ధరలకు రెక్కలొస్తున్నాయి. 20 వేల లీటర్ల కెపాసిటీ కలిగిన ట్యాంకర్‌కు రూ.10 వేల దాకా వసూలు చేస్తున్నారు. దీంతో అదనపు భారం పడుతుందని ఆందోళన చెందుతున్నారు. తప్పని పరిస్థితుల్లో నీటి ఛార్జీలు పెంచాల్సి వస్తుందని చెప్తున్నారు.
35-40 శాతం తగ్గనున్న సరఫరా
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల గ్రేటర్ హైదరాబాద్‌కు నీటి కొరత పొంచి ఉండటంతో జలమండలి అప్రమత్తమైంది. గేటెడ్ కమ్యునిటీలు ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే భూగర్భ జలాలు 45 శాతం దాకా సాధారణం కంటే దిగువకు పడిపోయినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఈనేపథ్యంలో ఇప్పటికే బల్క్ కనెక్షన్ కలిగిన వినియోగదారులకు నీటి పొదుపుపై జలమండలి సూచనలు చేస్తున్నది. నీటిని పొదుపుగా వాడుకోవాలని, రాబోయే రోజుల్లో సరఫరా 35 నుంచి 40 శాతం తగ్గనున్నట్లు గేటెడ్ కమ్యూనిటీలు, కాలనీల సొసైటీలకు ముందస్తుగానే హెచ్చరించినట్లు తెలుస్తున్నది. ఈనేపథ్యంలో నీటిని దుర్వినియోగం చేస్తే కఠినంగా వ్యవహరించనున్నట్లు ప్రకటించారని గేటెడ్ కమ్యూనిటీల అసోసియేషన్లు తెలిపాయి. ఈమేరకు తాము కూడా నీటి ఎద్దడి దృష్టిలో ఉంచుకుని నీటిని పొదుపు చేస్తున్నట్లు చెప్తున్నారు.
పరిస్థితి ఆందోళనకరంగా ఉంది
ఎల్‌నినో, వర్షాభావ పరిస్థితుల వల్ల సిటీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారాయి. అన్ని ప్రాంతాల్లో నీటి డిమండ్ క్రమంగా పెరుగుతున్నది. ఈనేపథ్యంలో ప్రజలు ట్యాంకర్లను ఆశ్రయిస్తున్నారు. అటు గేటెడ్ కమ్యూనిటీలో నీటి సమస్య పెరుగుతుండటంతో బయట నుంచి కొనుగోలు చేయాల్సి వస్తున్నది. దీంతో మెయింటెనెన్స్ ఛార్జీలు పెంచడం ప్రారంభమైంది. నోటీసు బోర్డులు, వాట్సాప్ గ్రూపుల్లో సూచనలు చేయాల్సి వస్తున్నది. బస్తీల నుంచి గేటెడ్ కమ్యూనిటీల దాకా నీటి గురించే చర్చ జరుగుతున్నది. జలమండలి కూడా అప్రమత్తం కావాల్సి వస్తున్నది. పంపింగ్‌లో సమస్యలు, పైపులైన్ల లీకేజీలు, పంపిణీలో అసమానతలు, పెరుగుతున్న డిమాండ్ వల్ల నీటి సరఫరాలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. వీటన్నింటిని అదుపు చేస్తే కొంతమేర ఇబ్బందుల తీవ్రత తగ్గే అవకాశం ఉంది. ఆ దిశగా జలమండలి పనిచేయాల్సిన అవసరం ఉంది.
-బీటీ శ్రీనివాసన్, జనరల్ సెక్రెటరీ, ఆర్డబ్ల్యూఏ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

