Karate | కాచిగూడ, మే 25: కరాటేలో హైదరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు సత్తా చాటారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని డాక్టర్ జీఎస్ గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జీవీఆర్ కరాటే అకాడమీలో జి.అమృతారెడ్డి, జి.ఘన సంతోషిణి రెడ్డి 11 నిమిషాల్లో పూర్తి చేయాల్సిన కరాటే ప్రదర్శనను కేవలం 9:36 నిమిషాల్లో పూర్తిచేశారు. 121 మెలుకువలను 11 విభాగాలు ప్రదర్శించి వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించారు. ఈ సందర్భంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి బింగి నరేందర్ గౌడ్, లింకా బుక్ ఆఫ్ రికార్డ్స్ ప్రతినిధి లయన్స్ విజయలక్ష్మి ధృవీకరించి అక్కాచెల్లెళ్లకు సర్టిఫికెట్లను అందజేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హిమాయత్ నగర్ కార్పొరేటర్ మహాలక్ష్మి, కాచిగూడ కార్పొరేటర్ ఉమా రమేష్ యాదవ్, నల్లకుంట కార్పొరేటర్ వై.అమృత, సోమాజిగూడ కార్పొరేటర్ సంగీత యాదవ్, మొండ మార్కెట్ కార్పొరేటర్ దీపిక,సమాచార హక్కు మాజీ కమిషనర్ ఖలీలోద్దిన్, వివేక్ హాస్పటల్ ఎండి డాక్టర్ కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. విదేశాల్లోనూ తెలంగాణ కరాటే విద్యార్థులు సత్తా చాటాలని హిమాయత్ నగర్, నల్లకుంట కార్పొరేటర్లు మహాలక్ష్మి,అమృత అన్నారు.