Triangle Love Story | ఆ 8 రోజులు హరిహరకృష్ణ ఏం చేశాడు? నవీన్‌ను చంపిన తర్వాత ఎటు వెళ్లాడు? ఆరా తీస్తున్న పోలీసులు
Triangle Love Story | ఒక అమ్మాయికి ఇద్దరు స్నేహితులు దగ్గర కావడం, తనకు ఆ అమ్మాయి ఎక్కడ దక్కకుండా పోతుందోననే అక్కసుతో దారుణానికి ఒడిగట్టిన హరిహర రెండు నెలల నుంచే నవీన్‌ను హత మార్చేందుకు ఫ్లాన్లో ఉన్నట్లు వెల్లడయ్యింది. హత్య చేసేందుకు కావాల్సిన కత్తిని కొనుగోలు చేసినట్లు తెలిసింది.
Triangle Love Story | సిటీబ్యూరో ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ) / పెద్దఅంబర్‌పేట: తన స్నేహితుడిని అతికిరాతకంగా గుండెలు చీల్చి హతమార్చిన హరిహర కృష్ణ పక్కా ప్లాన్‌తోనే హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. హత్య చేసిన అనంతరం 8 రోజులు ఏమి చేశాడనే విషయాలపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ నెల 17న అబ్దుల్లాపూర్‌మెట్ పరిసరాలలో నల్గొండ మహాత్మాగాంధీ యూనివర్శిటీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతున్న నాగర్‌కర్నూల్ జిల్లా సిరిసినగండ్లకు చెందిన నవీన్(22)ను అతని ఇంటర్ స్నేహితుడైన హరిహర కృష్ణ అమ్మాయి దక్కదనే భావనతో అత్యంత దారుణంగా హతమార్చిన విషయం తెలిసిందే. హత్య చేసిన తరువాత మరుసటి రోజు కూడా హరిహర కృష్ణ ఘటనాస్థలికి వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.
హత్య అనంతరం హరిహర వారి స్నేహితులు, యువతికి సంబంధించిన కాల్ రికార్డులు సోషల్‌మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇదిలాఉండగా పోలీసులు దిల్సుఖ్నగర్ నుంచి అబ్దుల్లాపూర్‌మెట్ వరకు నవీన్, హరిహర వెళ్లిన రూట్లో సీసీ కెమెరాలను పరిశీలించారు. నాగోల్‌లో ఒక చోట ఫాస్ట్‌పుడ్ తీసుకుంటున్నట్లు, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతంలో మద్యం తీసుకున్నట్లు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. ఆ తరువాత హత్య అనంతరం నిందితుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్లాడనే విషయంలో సాంకేతికపరమైన ఆధారాల సేకరణలో భాగంగా సీసీ కెమెరాలతో రూట్‌ను మ్యాపింగ్ చేస్తున్నారు.
రెండు నెలలుగా స్కెచ్
ఒక అమ్మాయికి ఇద్దరు స్నేహితులు దగ్గర కావడం, తనకు ఆ అమ్మాయి ఎక్కడ దక్కకుండా పోతుందోననే అక్కసుతో దారుణానికి ఒడిగట్టిన హరిహర రెండు నెలల నుంచే నవీన్‌ను హత మార్చేందుకు ఫ్లాన్లో ఉన్నట్లు వెల్లడయ్యింది. హత్య చేసేందుకు కావాల్సిన కత్తిని కొనుగోలు చేసినట్లు తెలిసింది. హత్య చేసిన తరువాత రెండు మూడు రోజులు దిల్సుఖ్నగర్, అబ్దుల్లాపూర్‌మెట్ ప్రాంతాలలో తిరిగినట్లు పోలీసులు గుర్తంచారు. అయితే ఎవరు ఫోన్ చేసినా తనకేమీ తెలియదని, ఓఆర్ఆర్ వద్ద రాత్రి వదిలేసానంటూ హరిహర అందరికీ చెబుతూ వచ్చాడు. తన స్వస్థలం వెళ్లి ఒకటి రెండు రోజులు గడిపాడు. అయితే 24న తన తండ్రికి ఈ విషయం హరిహర చెప్పడంతో, చేసింది తప్పని వెంటనే తీసుకొచ్చి అబ్దుల్లాపూర్‌మెట్ పోలీసులకు అప్పగించానని హరిహర తండ్రి ప్రభాకర్ ప్రకటించాడు. హరిహర ఒక్కడే చేసి ఉండకపోవచ్చని, ఇంకా ఎవరైనా ఇందులో ఉండే అవకాశాలున్నాయని అతడు అనుమానాలు కూడా వ్యక్తం చేశాడు. ఇదిలా ఉంటే నిందితుడిని కోర్టులో హాజరుపరిచామని, కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని అన్ని వివరాలు సేకరిస్తామని ఎల్బీనగర్ డీసీపీ సాయి శ్రీ తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ప్రభుత్వంలో భయం పుట్టింది.. సీఈసీపై పోరును తమపై పోరుగా మల్చుకుంది : సీజేపీ
man pushes girlfriend into gorge | బ్రేకప్ చెప్పిన ప్రియురాలు.. ఆమెను లోయలోకి తోసేసిన ప్రియుడు
Kiran Abbavaram | రొటీన్ సినిమాలకు చెక్ పెట్టి కొత్త ప్రయోగాలు చేస్తున్న కిరణ్ అబ్బవరం!
CJP Protest | కోర్టు ఆదేశించినా కొనసాగుతున్న అరెస్టుల పర్వం.. ఢిల్లీలో పలువురు నేతల నిర్బంధం
Foreign Gold Seize | విశాఖలో 5.83 కిలోల విదేశి బంగారం పట్టివేత..దాని విలువ ఎంతంటే ?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

