బోడుప్పల్, సెప్టెంబర్17 : రాష్ట్ర నూతన సెక్రటేరియట్‌కు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని బోడుప్పల్ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి అన్నారు. బోడుప్పల్ ప్రధాన కూడలిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మేయర్ సామల బుచ్చిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సెక్రటేరియట్‌కు బీఆర్ అంబేద్కర్ పేరును ప్రతిపాదించి ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత పక్షపాతిగా మరోమారు రుజువు చేసుకున్నారని తెలిపారు. నిరుపేద గిరిజనుల కుటుంబాలకు రూ.10లక్షలు ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకోవడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మీరవిగౌడ్, స్థానిక టీఆర్ఎస్ కార్పొరేటర్లు, కో ఆప్షన్ మెంబర్లు, నాయకులు మీసాల కృష్ణ, రవిగౌడ్, శేఖర్‌రెడ్డి, రామచంద్రారెడ్డి, చక్రపాణిగౌడ్, విశ్వనాథ్, యువజన నాయకులు, పాల్గొన్నారు.
కేశవరం గ్రామంలో..
శామీర్‌పేట, సెప్టెంబర్ 17 : రాష్ట్ర సచివాలయానికి డాక్టర్ బీఆర్.అంబేద్కర్ పేరు పెడుతున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన నేపథ్యంలో కేశవరం గ్రామంలో శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ జ్యోతిబల్రాంగౌడ్, రాష్ట్ర అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు సాయికుమార్, వార్డు సభ్యులు శ్రీశైలం, వినోద్, గ్రామ అధ్యక్షుడు భూమేశ్ గౌడ్, మైసయ్యయాదవ్, ఇంద్రసేనారెడ్డి, చిత్తారి, బాలరాం, లక్ష్మీనారాయణ, కృష్ణ, వీరస్వామి పాల్గొన్నారు.
కేశవరంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేస్తున్న ప్రజాప్రతినిధులు, పలు సంఘాల రాష్ట్ర నేతలు