Hyderabad | హైదరాబాద్లో వారం రోజులుగా ఓ ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయడం లేదు. అయినప్పటికీ ట్రాఫిక్ పోలీసులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మైలార్దేవ్పల్లి ప్రాంతంలోని దుర్గానగర్ వద్ద ఉన్న ట్రాఫిక్ సిగ్నల్ గత ఏడు రోజులుగా పనిచేయడం లేదు. సిగ్నల్ పనిచేయకపోవడంతో భారీగా ట్రాఫిక్జామ్ అవుతోంది. దీంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
వారం రోజులుగా ట్రాఫిక్ సిగ్నల్ పనిచేయకపోయినా పట్టించుకోకపోవడంపై వాహనదారులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. బండ్లగూడ నుంచి ఆరాంఘర్ చేరుకునేందుకు 40 నిమిషాల సమయం పడుతుందని, వెంటనే ట్రాఫిక్ సిగ్నల్ బాగు చేయించాలని డిమాండ్ చేస్తున్నారు.
వారం రోజులుగా పని చేయని ట్రాఫిక్ సిగ్నల్
ట్రాఫిక్ జామ్ వల్ల ఇబ్బంది పడుతున్న వాహనదారులు
హైదరాబాద్ – మైలర్దేవ్పల్లి ప్రాంతంలోని దుర్గా నగర్ వద్ద గత వారం రోజులుగా పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్
బండ్లగూడ నుండి ఆరాంఘర్ చేరుకునేందుకు 40 నిమిషాల సమయం పడుతుండడంతో, తీవ్ర ఇబ్బందులకు… pic.twitter.com/1V09ir2hbP
— Telugu Scribe (@TeluguScribe) February 4, 2026