ISB | హైదరాబాద్‌లోని ఇండియన్ బిజినెస్ స్కూల్ (ISB) దేశంలోనే నెంబర్ వన్‌గా నిలిచింది. పైనాన్షియల్ టైమ్స్ (ఎఫ్టీ) గ్లోబల్ ఎంబీఏ ర్యాంకింగ్ -2024 సోమవారం విడుదలయ్యాయి. ఇందులో ఐఎస్బీ టాప్ ర్యాంకును మరోసారి నిలబెట్టుకోగా.. గ్లోబల్ ర్యాంకింగ్స్‌లో 31వ స్థానానికి చేరింది. గతేడాది అంతర్జాతీయ ర్యాంకింగ్స్‌లో 39వ ర్యాంక్‌లో నిలిచిన విషయం తెలిసిందే. 229శాతం పెరుగుదలతో వార్షిక వేతన పెరుగుదల అంశంలో అంతర్జాతీయంగా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. రీసెర్చ్ ర్యాంకింగ్‌తో పాటు, అలుమ్ని, పోస్ట్ పీజీపీ వేతనాలపరంగా అత్యుత్తమ ప్రతిభ కనబరిచింది.
గ్లోబల్ రీసెర్చ్ ర్యాంకింగ్స్‌లో 52వ స్థానంలో నిలువగా.. అలుమ్ని నెట్‌వర్క్‌లో దేశంలో టాప్-బీ స్కూల్‌గా నిలవడమే నిలిచింది. దాంతో పాటు అంతర్జాతీయంగా 8వ ర్యాంక్‌ను సైతం కైవసం చేసుకుంది. ఐఎస్బీ తర్వాత ఐఐఎం అహ్మదాబాద్ జాతీయంగా రెండో ర్యాంక్, అంతర్జాతీయంగా 41వ ర్యాంక్, ఐఐఎం బెంగళూరు జాతీయంగా మూడోర్యాంక్, అంతర్జాతీయంగా 47వ ర్యాంక్‌ను అందుకున్నాయి. ఐఐఎం కోల్కత్తా జాతీయంగా మూడు, అంతర్జాతీయంగా 67, ఐఐఎం లక్నో జాతీయంగా నాలుగు, అంతర్జాతీయంగా 85, జేవియర్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ జాతీయంగా ఐదో, అంతర్జాతీయంగా 99వ ర్యాంకులను దక్కించుకున్నాయి.