కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 11 : గంజాయి, ఇతర మత్తు పదార్థాల ముఠాలపై మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గడిచిన ఆరు నెలలుగా ప లు గంజాయి ముఠాలను పట్టుకుని జైలుకు పంపి.. కోట్ల విలువ చేసే గంజాయిని, ఇతర మత్తు పదార్థాలను స్వా ధీనం చేసుకున్నారు. అలాగే.. యువత ‘మత్తు’కు బానిస కాకుండా ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు.
ఆరు నెలల్లో 56 కేసులు..
జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్‌శాఖ అధికారి విజయభాస్కర్, జిల్లా ఎక్సైజ్ టాస్క్‌ఫోర్స్ అధికారి సహదేవుడుతో పాటు జిల్లా పరిధిలోని ఎక్సైజ్ విభాగం.. పోలీసు బృందాల సహకారంతో గడిచిన ఆరు నెల లుగా విస్తృతంగా తనిఖీలు చేపట్టి…పెద్ద మొత్తంలో మత్తు పదార్థాల ను సీజ్ చేశారు. ఇప్పటి వరకు 180 మంది వరకు బైండోవర్ చేయ గా.. 56 కేసులు నమోదు చేశారు. వీటిలో 85 మందిని అరెస్ట్ చేయగా.. 50 మందికి పైగా జైలు జీవితాలను గడుపుతున్నారు. 79 కేజీల ఎండు గంజాయి, 5 కేజీల మెఫడిన్, 4.5 కేజీల ఆల్భోజం, 1.600 లీటర్ల హషిష్ ఆయిల్, 12 గ్రాముల కొకైన్ వంటి కోట్ల రూపాయల విలువ చేసే మత్తు పదార్థాలతో పాటు 26 వాహనాలను సీజ్ చేశారు.
యువతకు కౌన్సెలింగ్ ..
నగర శివారు ప్రాంతాల్లో మత్తుపదార్థాలు సరఫరా అవుతుం డటంతో ఎక్సైజ్ విభాగం అప్రమత్తమైంది. నిఘా పెట్టి.. గంజాయి ముఠాలను అదుపులోకి తీసుకుంటున్నారు. అదే విధంగా ‘మత్తు’కు బానిసగా మారుతున్న యువతకు కౌన్సెలింగ్ ఇస్తున్నారు. మత్తు నుంచి బయటపడేందుకు, అటువైపుకు వెళ్లకుండా ఉండేలా జాగ్రత్త లు, అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారు.
జీవితాలను నాశనం చేసుకోవద్దు..
విద్యార్థులు, వివిధ రంగాల్లో ఉన్న వ్యక్తులు మత్తుకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దు.. తల్లిదండ్రులను, కుటుంబాలను దూరం చేసుకోకుండా ‘మత్తు’కు దూరంగా ఉండాలి. అలాగే.. అందుకు ప్రోత్సహిస్తున్న వారినుంచి కూడా దూరంగా ఉం డాలి. మత్తు పదార్థాల సరఫరా నియంత్రణలో నిఘాను పటిష్ట వంతం చేస్తున్నాం. ఎలాంటి అనుమానాలు ఉన్నా నేరుగా మా దృష్టికి గానీ, డయల్ 100కు గానీ సమాచారం ఇవ్వాలి.
– విజయభాస్కర్, మేడ్చల్ జిల్లా ప్రొహిబిషన్, ఎక్సైజ్ శాఖ అధికారి