ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
కాచిగూడ/ గోల్నాక, మార్చి 19: తన దృష్టికి వచ్చిన స్థానిక సమస్యలను ఎప్పటికప్పడూ పరిష్కరిస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ తెలిపారు. శనివారం గోల్నా క డివిజన్ ఖాద్రీబాగ్ బస్తీ కమిటీ ప్రతినిధులు గోల్నాక లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్‌ను కలసి తమ సమస్యలు వివరించారు. ముఖ్యంగా మంచినీటి సమస్య, వెలగని వీధిదీపాలు, పాడైన రహదారులు, దోమల సమస్య, పారిశుధ్య సమస్యతో పాటు కొత్తగా కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని బస్తీ కమిటీ ప్రతినిధులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా.. వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడారు. వీలైనంత త్వరగా మంచినీటి పైపులైన్ల ఏర్పాటు, కొత్త సీసీ రోడ్డు ఏర్పాటుతో పాటు కమ్యూనిటీ హాల్ నిర్మాణం తదితర సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఖాద్రీబాగ్ కమిటీ ప్రతినిధులు శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్‌గౌడ్, సత్యనారాయణ, గోపీగౌడ్, భాస్కర్‌యాదవ్, బస్వరాజ్, విజయ, మల్లేశ్వరి, స్వప్న, ప్రియ తదితరులు పాల్గొన్నారు.
రాజకీయలకు అతీతంగా పార్క్‌ల అభివృద్ధి..
కాచిగూడ : రాజకీయలకు అతీతంగా నియోజకవర్గంలోని పార్కులను అభివృద్ధి చేస్తున్నట్లు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. బర్కత్‌పురలోని బసంత్కాలనీ పార్కులో జరుగుతున్న అభివృద్ధి పనులను శనివారం కాచిగూడ కార్పొరేటర్ ఉమాయాదవ్తో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు.అనంతరం పార్కులోని సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రం హరితహారంగా ఉం డేందుకు ప్రతి ఒక్కరూ పార్కుల్లో మొక్కలు నాటుతూ, చెట్లను రక్షించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కన్నె రమేశ్‌యాదవ్, జీహెచ్ఎంసీ ఈఈ శంకర్, డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, సంపత్, సుభాశ్పటేల్, కృష్ణకుమార్, ఎం.నర్సింగ్‌రావు, క్షీర్సాగర్, మల్లికార్జున్, రమాదేవి, భీంరాజ్, పంకజ్, వాసు, దీపక్, రాజ్‌కుమార్, రవియాదవ్, చందు, ఆనంద్, రాము తదితరులు పాల్గొన్నారు.