ఎమ్మెల్యే ముఠా గోపాల్
కవాడిగూడ, మార్చి 19 : బాక్సింగ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్నారు. ఈ మేరకు శనివారం భోలక్‌పూర్ డివిజన్లోని ఘంటసాల మైదానంలో టీఆర్ఎస్ భోలక్‌పూర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో బాక్సింగ్ కోచ్ కృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన 12 ఏండ్ల నుంచి 29 ఏండ్ల సీనియర్, జూనియర్, సబ్ జూనియర్ స్థాయి పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నిజామాబాద్ జిల్లాకు చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన నిఖత్ జరీనా ఎన్నో టోర్నమెంట్లలో రాణించి మంచి గుర్తింపు పొందిందని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో రాణించే వారంతా ఎక్కువ శాతం నిరుపేద కుంటుంబం నుంచే వచ్చినవారేనని అన్నారు. పిల్లలకు మంచి క్రమశిక్షణతో కూడిన బాక్సింగ్ శిక్షణను ఇవ్వాలని బాక్సింగ్ కోచ్ కృష్ణకు సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తుందని అన్నారు. విద్యార్థులు విద్యతో పాటు అన్ని రంగాలలో రాణించాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నగర యువజన విభాగం సీనియర్ నాయకుడు ముఠా జయసింహ, భోలక్‌పూర్ బీసీ సెల్ అధ్యక్షుడు గుండా ఉమాకాంత్ ముదిరాజ్, డివిజన్ కమిటీ ఉపాధ్యక్షుడు ఎ. శంకర్ గౌడ్, ఆర్. శ్రీనివాస్, గోవింద్ రాజ్, పానుగంటి మహేశ్ కుమార్, శ్రీనివాస్ గుప్తా, ప్రవీణ్ కుమార్, రవీందర్ తదితరులు పాల్గొన్నారు.