ధువీకరణ పత్రాలు సమర్పించండి.. మీరే యజమానులవ్వండి
జీఓ అవగాహన సదస్సులో ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
మియాపూర్, మార్చి 19 : పేద ప్రజల కండ్లలో వెలుగులు నింపాలనే సంకల్పంతో ప్రభుత్వ నివాస స్థలాల క్రమబద్ధీకరణను మరోమారు చేపడుతున్నదని, ఈ సదవకాశాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ అన్నారు. అనధికార స్థలంలో నివాసం ఏర్పరుచుకుని ఉంటున్న ప్రజలు నిర్ధారిత నిబంధనల మేరకు తగు ధ్రువీకరణ పత్రాలను సమర్పించటం ద్వారా యజమానులుగా మారే అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణపై ప్రభుత్వం జారీ చేసిన జీవో 58, 59లపై ప్రజలలో అవగాహన కల్పించేందుకు ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని గోదా ఫంక్షన్హాల్లో శనివారం అధికారులు, ప్రజాప్రతనిధులతో కలిసి విప్ అరెకపూడి గాంధీ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వెంకటేశ్ గౌడ్, నార్నె శ్రీనివాసరావు, జూపల్లి సత్యనారాయణ, మాధవరం రోజాదేవి, తాసీల్దార్ గోవర్ధన్, ఆర్ఐ శ్రీనివాసరెడ్డి, సర్వేయర్ శ్రీనాథ్, కాలనీ, పార్టీ నేతలు మాధవరం రంగారావు, సంజీవరెడ్డి, సమ్మారెడ్డి, అనీల్‌రెడ్డి, కార్యకర్తలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కూకట్పల్లి డివిజన్ పాపిరెడ్డినగర్ కాలనీ పేద వాడలలోని ఏ బీ సీ బ్లాక్‌లలో నివసించే ప్రజలకు తగు న్యాయం చేస్తామని విప్ గాంధీ హామీ ఇచ్చారు.
చందానగర్ డివిజన్లో..
కొండాపూర్ : చందానగర్ డివిజన్ పరిధిలోని క్రిస్టల్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ‘58,59’ జీఓలపై అవగాహన సదస్సుకు విప్ గాంధీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ.. మార్చి 31వ తేదీ వరకు మీ సేవా కేంద్రాల ద్వారా అర్హులు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. 125 గజాలలోపు స్థలాల్లో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారికి పూర్తి ఉచితంగా క్రమబద్ధీకరిస్తుండగా, 250 గజాల వరకు 50 శాతం ఫీజుతో, 500ల గజాల్లో నివాసాలకు 75 శాతం, ఆపై నిర్మాణాలకు 100 శాతం రిజిస్ట్రేషన్ ధరలు చెల్లించాల్సిందిగా తెలిపారు. నవభారత్‌నగర్, వడ్డెరబస్తీ, ఇజ్జత్‌నగర్, హరిజన బస్తీ, భిక్షపతినగర్, సర్వే నెంబర్ 60,71 నుంచి 77వరకు కొండాపూర్ గ్రామంలోని రాఘవేంద్ర కాలనీ, రాజరాజేశ్వరీ కాలనీ, గోల్డెన్ తులిప్(యూఎల్సీ క్లియరెన్స్), నేతాజీనగర్, నల్లగండ్ల విలేజ్ సర్వే నెంబరు 195, ఎన్టీఆర్నగర్, సోఫా కాలనీ, తాజ్‌నగర్, గోపన్‌పల్లి విలేజ్ సర్వే నంబర్ 124, గోపన్‌పల్లి తాండ, డైమండ్ హైట్స్ 20 ఎకరాల హుడా లేఔట్లలో నివాసం ఉంటున్న నివాసాలకు, గృహాలకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఆర్డీఓ చంద్రకళ, ఎంఆర్ఓ వంశీ మోహన్, కార్పొరేటర్లు మంజుల రఘునాథరెడ్డి, పూజిత, జగదీశ్వర్‌గౌడ్, ఉప్పలపాటి శ్రీకాంత్, గంగాధర్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా, డివిజన్ అధ్యక్షులు పాల్గొన్నారు.