సర్కిల్ 18 పరిధిలో పనికిరాని వస్తువుల సేకరణ
బంజారాహిల్స్,మార్చి 19: ఇంట్లో చాలా కాలంగా పనికిరాకుండా మూలన పడేసిన వస్తువులను తెచ్చి వీధి చివర్లో పారవేస్తుంటాం. పాత కుర్చీలు, విరిగిన సోఫాలు, పాడైపోయిన పరుపులు, కిటికీలకు బిగించే అద్దాలు, విరిగిన మంచాలు, గుట్టలుగా పేరుకుపోయిన పాత బట్టలను ఏం చేసుకోవాలో అర్థం కాక అలాగే పెట్టుకుంటాం. ఇల్లు సర్దుకునే సమయంలో కనిపించిన ఇలాంటి పనికిరాని వస్తువులను ఇంటి బయట పారేయడమో లేక సమీపంలోని ఖాళీ ప్రదేశాల్లో వేస్తుంటారు. ఇష్టమొచ్చినట్లు రోడ్లపక్కన గుట్టలుగా పారవేస్తున్న పనికిరాని వస్తువులతో పరిసరాలు అపరిశుభ్రంగా కనిపిస్తుంటాయి. దీన్ని దృష్టిలో పెట్టుకుని జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో వారంరోజుల క్రితం స్పెషల్ డ్రై వ్ను ప్రారంభించింది. రోజుకో ప్రాంతంలో జీహెచ్ఎంసీ పారిశుధ్య విభాగం సిబ్బంది పర్యటిస్తూ ఇండ్లలో పనికిరాని వస్తువులు సేకరిస్తున్నారు.
సర్కిల్ పరిధిలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, వెంకటేశ్వరకాలనీ, షేక్‌పేట డివిజన్ల పరిధిలో ఈ స్పెషల్ డ్రైవ్‌లో భాగంగా నాలుగు వాహనాలను వినియోగిస్తున్నారు. ఎంపిక చేసిన ప్రదేశానికి వెళ్లి పనికిరాని వస్తువులను ట్రక్కులో వేసుకుంటున్నారు. సర్కిల్ 18 పరిధిలో మొత్తం 153 లోకాలిటీలు ఉన్నాయని, వాటన్నింటిలో ప్రత్యేక బృం దాలు వెళ్లి పనికిరాని వస్తువులను సేకరిస్తాయని అధికారులు తెలిపారు. డివిజన్‌కు ఒక్కో వాహనంతో పాటు నలుగురు పారిశుధ్య కార్మికులు ఉంటారని, ముందురోజే ఆయా ప్రాంతాల్లో స్వచ్ఛ ఆటోల ద్వారా పనికిరాని వస్తువులు సేకరించే వాహనం వ స్తుందని ప్రచారం చే స్తున్నారు. దాంతో ఈ వా హనం వచ్చిన వెంటనే తమ ఇం ట్లోని పనికిరాని వస్తువులను వా హనంలో వేస్తున్నారు.
డ్రై రిసోర్స్ సెంటర్‌కు తరలిస్తాం
ఇండ్లల్లో సేకరించిన పనికిరాని వస్తువులను ట్యాంక్ బండ్ కింద ఉన్న జీహెచ్ఎంసీ డ్రై రిసోర్స్ సెంటర్‌కు తరలిస్తాం. అక్కడ ఏవైనా పనికి వచ్చే వస్తువులు ఉంటేవాటిని పక్కకు తీస్తారు. పనికి రాని వస్తువులను చిన్న చిన్న ముక్కలుగా చేయడంతో పాటు డ్రై వేస్ట్‌గా మారుస్తారు. అనంతరం వాటిని రీసైకిలింగ్ కోసం పంపిస్తారు. రోడ్లపక్కన పనికిరాని వస్తువులు పారవేయడంతో అపరిశుభ్రమైన వాతావరణం ఏర్పడుతున్నందున ఈ స్పెషల్ డ్రైవ్ చేపట్టాం.
–డా. రవికాంత్, ఏఎమ్వోహెచ్, సర్కిల్ 18