బోడుప్పల్, మార్చి 11: బోడుప్పల్ నగరపాలక పరిధిలో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేస్తున్నట్లు మేయర్ సామల బుచ్చిరెడ్డి అన్నారు. 16వ డివిజన్ ఎస్బీఆర్, టెలిఫోన్ కాలనీల్లో రూ.1.20కోట్ల నిధులతో చేపట్టిన సీసీరోడ్డు పనులను శుక్రవారం మేయర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ దశల వారీగా అంతర్గత రోడ్లను సీసీరోడ్లుగా మార్చనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ చందర్‌గౌడ్, కాలనీ అధ్యక్షుడు ప్రభాకర్‌రెడ్డి, కాలనీవాసులు పాల్గొన్నారు.
తూంకుంట అభివృద్ధికి కృషి..
శామీర్‌పేట, మార్చి 11 : తూంకుంట మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్లు చైర్మన్ కారంగుల రాజేశ్వర్‌రావు అన్నారు. మున్సిపల్ పరిధిలోని దేవరయాంజాల్ 16వ వార్డులో శుక్రవారం సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ రూ.20 లక్షలతో సీసీరోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశారు. కాలనీల వారీగా సమస్యలను గుర్తించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ వాణివీరారెడ్డి, కౌన్సిలర్లు నర్సింగ్రావుగౌడ్, ఉమశ్రీనివాస్ముదిరాజ్, కో ఆప్షన్ సభ్యులు షఫిఉల్లాబేగ్, మాజీ సర్పంచులు బోజేశ్వర్రావు, గోల్డ్ శ్రీనివాస్, నర్సింగ్‌రావు, లక్ష్మీనారాయణ, నర్సింహారెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బాసరేగడిలో శ్మశాన వాటిక పనులు..
మేడ్చల్ రూరల్ : గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ బాసరేగడిలో రూ.8 లక్షలతో చేపట్టిన శ్మశానవాటిక పనులను వైస్ చైర్మన్ ప్రభాకర్, కౌన్సిలర్ రాజకుమారిసుధాకర్ప్రారంభించారు. అభివృద్ధికి సహకరిస్తున్న చైర్పర్సన్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కో ఆప్షన్ సభ్యుడు చిన్నపరెడ్డి, నాయకులు ఫిలిప్స్, సుధాకర్, భాస్కర్, శ్రావణ్, చర్చి పెద్దలు పాల్గొన్నారు.