ముషీరాబాద్, ఫిబ్రవరి 27: హైదరాబాద్ మహా నగరంలో త్వరలోనే మరో 94 బస్తీ దవాఖానాలను ప్రారంభించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. రాష్ట్రంలో ప్రారంభించిన బస్తీ దవాఖానలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, కేంద్ర 15వ ఆర్థిక సంఘం బస్తీ దవాఖానాల ఏర్పాటు ప్రయత్నాన్ని అభినందించడంతో పాటు దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఇటువంటి ప్రయత్నాలు చేయాల్సిందిగా సూచించిందన్నారు. నగరంలోని ఇందిరా పార్కు వద్ద ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో చుక్క ల మందు పంపిణీ కార్యక్రమాన్ని పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో మంత్రి హరీశ్ రావు కలిసి ప్రారంభించారు. అనంతరం, మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, గ్రామాల నుంచి నగరాల వరకు ప్రతి చిన్నారికి పల్స్ పోలియో చుక్క ల మందు పంపిణీ చేస్తామని, ఇందుకు అన్ని చోట్లా సెంటర్లను ఏర్పాటు చేశామన్నారు. పోలియో చుక్క ల మందును ప్రతి చిన్నారికి తల్లిదండ్రులు విధిగా వేయించాని, నిర్లక్ష్యం ఎంత మాత్రం తగదని సూ చించారు.
పోలియోతో బాధపడుతున్న చిన్నారుల పరిస్థితిని గమనించి, అలాంటి బాధ తమ పిల్లలకు రాకుండా జాగ్రత్త పడాలని కోరారు. జంట నగరా ల్లో 350 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారని, ఇప్పటి వర కు 256 బస్తీ దవాఖానాలను అందుబాటులోకి తీ సుకువచ్చామని తెలిపారు. ఎక్కడెక్కడ ఏర్పాటు చే స్తే పేదలకు అందుబాటులో ఉంటుందో పరిశీలించి, నగరంతో పాటు, శివారు మున్సిపాలిటీల్లో మరో 94 బస్తీ దవాఖానలను ఏర్పాటు చేయాల్సిందిగా సీఎం కేసీఆర్ ఆదేశించినట్లు చెప్పారు. హైదరాబాద్‌లో ప్రారంభించిన బస్తీ దవాఖానలు పేదల సుస్తిని దూరం చేస్తున్నాయని, 57 రకాల వైద్య పరీక్షలను ఉచితంగా చేసి మందులు అందించడం జరుగుతుందని తెలిపారు.
బస్తీ దవాఖనాల ఏర్పాటుతో పేదలు ప్రైవేటు ఆసుపత్రుల చుట్టూ తిరిగి వేలాది రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా పోతుందన్నారు. అధునాత యంత్రాలతో వైద్య పరీక్షలు నిర్వహించడంతో పాటు బస్తీ దవాఖానాల ద్వారా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం జరుగుతుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని, ఇటీవలే సాయంత్రం వేళల్లో సైతం వైద్య సేవలు అందించాలని నిర్ణయించినట్లు చెప్పా రు. ఈ కార్యక్రమంలో పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్, ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, కుటుం బ సంక్షేమ శాఖ కమిషనర్ వాకాటి కరుణ, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్వన్, డీఎంహెచ్ఓ వెంకట్, కవాడిగూడ కార్పొరేటర్ రచనశ్రీతో పాటు వైద్య ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.