మైలార్‌దేవ్‌పల్లి/బండ్లగూడ/అత్తాపూర్/మణికొండ/శంషాబాద్ రూరల్, ఫిబ్రవరి 27: చిన్నారుల సంపూర్ణ ఆరోగ్యానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించడం బాధ్యతగా తీసుకోవాలని రాజేంద్రనగర్ నియోజకవర్గం ఎమ్మెల్యే టి.ప్రకాశ్‌గౌడ్ తెలిపారు. ఆదివారం గణేశ్‌నగర్ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్ హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సమాజంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా తీసుకొని ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ శృజనా, డాక్టర్ అర్చన, శ్రేయశ్రీ, డివిజన్ అధికారులు బలరాం, శ్రీనివాస్, మండల పల్స్ పోలియో ఇన్చార్జి డాక్టర్ శ్వేత, హెల్త్ కమ్యూనిటీ అధికారి సిరాజ్వుద్దీన్, చెన్నకేశవులు, స్టాఫ్ నర్స్ జకీరా, మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ అధ్యక్షుడు ప్రేమ్‌గౌడ్, మాజీ అధ్యక్షుడు సరికొండ వెంకటేశ్, తిరుమల వెంకటేశ్, బాస శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
నిండైన జీవితానికి రెండు చుక్కలు
రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి ప్రాంతాల్లో ఎమ్మెల్యే ప్రకాశ్‌గౌడ్, మణికొండ మున్సిపాలిటీలో చైర్మన్ కె.నరేందర్, వైస్ చైర్మన్ కె.నరేందర్‌రెడ్డి, నార్సింగి మున్సిపాలిటీలో చైర్పర్సన్ రేఖ, వైస్ చైర్మన్ వెంకటేశ్ యాదవ్, కౌన్సిలర్లతో పాటు శంషాబాద్, బండ్లగూడ జాగీర్ మున్సిపాలిటీల్లో మేయర్ మహేందర్‌గౌడ్, మున్సిపాలిటీ చైర్పర్సన్ సుష్మారెడ్డితో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ఆయా వార్డులు, గ్రామపంచాయతీలలో పోలియో చుక్కల పంపిణీ కార్యక్రమాల్లో వేర్వేరుగా పాల్గొన్నారు.
బండ్లగూడలో..
బండ్లగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో బండ్లగూడ జాగీర్ మేయర్ మహేందర్‌గౌడ్, కార్పొరేటర్ అస్లం బిన్ అబ్దుల్లా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.
అత్తాపూర్ డివిజన్లో..
అత్తాపూర్ డివిజన్ హుడా కాలనీలో పోలియో కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు వనం శ్రీరాంరెడ్డి, పాండురంగానగర్‌లో జరిగిన కార్యక్రమాన్ని నాయకురాలు మాదవీ అమరేందర్ ప్రారంభించి, చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. హైదర్‌గూడలో జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమంలో రాజేంద్రనగర్ సర్కిల్ డీఎంహెచ్ఓ పద్మ, స్థానిక కార్పొరేటర్ సంగీత, టీఆర్ఎస్ నాయకులు సుభాష్‌రెడ్డి, చిన్న, నరేందర్‌రావు, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అత్తాపూర్‌లో జరిగిన కారక్రమంలో జిల్లా టీఆర్ఎస్ నాయకులు సురేందర్‌రెడ్డి, వార్డుకమిటీ సబ్యుడు సురేశ్‌రెడ్డి పాల్గొన్నారు.
శంషాబాద్ రూరల్‌లో..
మదన్‌పల్లి, పెద్దతూప్ర, ఘాన్సిమియాగూడ గ్రామాలల్లో శంషాబాద్ ఎంపీపీ జయమ్మ శ్రీనివాస్, జడ్పీటీసీ నీరటి తన్వి రాజు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ నీలం మోహన్‌నాయక్, సర్పంచ్ తుల్చనాయక్, ఉప సర్పంచ్ ఆంజనేయులు గౌడ్‌తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. దీంతోపాటు మండలంలోని 27 గ్రామ పంచాయతీలలో ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు చిన్నారులకు చుక్కలు వేశారు.
శంషాబాద్ మున్సిపాలిటీలో..
శంషాబాద్ మున్సిపాలిటీలోని 25 వార్డుల్లో ఆయా వార్డు కౌన్సిలర్లు చిన్నారులకు చుక్కలు వేశారు. కార్యక్రమంలో నాయకులు శ్రీనివాస్, పాండురంగారెడ్డి, సురేశ్, అమరేందర్చారి, రాజు, భాస్కర్, భరత్ తదితరులు పాల్గొన్నారు.
మలక్‌పేట క్లస్టర్ పరిధిలో..
మలక్‌పేట నియోజకవర్గం పరిధిలోని మూసారాంబాగ్, పాత మలక్‌పేట, సైదాబాద్, అక్బర్‌బాగ్, ఆజంపురా, చావునీ డివిజన్లలో పల్స్ పోలియో కార్యక్రమం ఆదివారం కొనసాగింది. మలక్‌పేట క్లస్టర్ పరిధిలోని ఐదు పట్టణ ఆరోగ్య కేంద్రాల పరిధిలో 191 పల్స్ పోలియో కేంద్రాలను ఏర్పాటుచేసి పిల్లలకు పోలియో చుక్కలు వేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ బిర్జిస్ ఉన్నీసా తెలిపారు. మొత్తం 40671 మంది చిన్నారులు ఉండగా, 37587 (92.42%) మందికి చుక్కలు వేశారు. మిగిలిన వారికి సోమవారం వేయనున్నారు. దిల్సుఖ్నగర్ బస్‌స్టాండ్, మెట్రోస్టేషన్, మూసారాంబాగ్ మెట్రోస్టేషన్, న్యూ మార్కెట్, మలక్‌పేట మెట్రోస్టేషన్లలో, మలక్‌పేట ఎంఎంటీఎస్ స్టేషన్, మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రాంతాల్లో కేంద్రాలు ఏర్పాటు చేశారు. మూసారాంబాగ్ శాలివాహననగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేటర్ భాగ్యలక్ష్మీమధుసూదన్రెడ్డి, సైదాబాద్‌లోని మూడుగుళ్ల చౌరస్తా వద్ద మాజీ కార్పొరేటర్ సింగిరెడ్డి స్వర్ణలతారెడ్డి, పాత మలక్‌పేట డివిజన్లోని ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో డివిజన్ ఎంఐఎం అధ్యక్షుడు షఫీ, అక్బర్‌బాగ్, ఆజంపురా, చావునీ డివిజన్లలో కార్పొరేటర్లు పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. కార్యక్రమంలో అంబాబాయి, తులసీ, దినేశ్, సచిన్, మల్లేశ్, సైదాబాద్ మూడు గుళ్లవద్ద ఆశ వర్కర్లు రోహిణి, అరుణ, కాలనీలవాసులు విజయలక్ష్మి, ఉమా, సందీప్ పాల్గొన్నారు.