కుత్బుల్లాపూర్ జోన్‌బృందం, ఫిబ్రవరి 27: రెండు చుక్కలు..నిండు జీవితాలకు వెలుగులు ఇస్తాయని..ఐదేండ్ల లోపు పిల్లలందరికీ తప్పనిసరిగా పల్స్‌పోలియో చుక్కలు వేయించే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. కుత్బుల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన పోలియో చుక్కల కార్యక్ర మాన్ని ఆయన ప్రారంభించారు. పోలియో మహమ్మారిని సమూ లంగా నిర్మూలించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాల న్నారు. కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ చైర్మన్ సన్నా శ్రీశైలంయాదవ్, డా.వేణుమాధవి, ఇందిరారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా.. నియోజకవర్గం పరిధిలో మొత్తం 71,206 మంది ఐదేండ్లలోపు చిన్నారులు ఉండగా ఆదివారం 66,824 మంది(93.80 శాతం) చిన్నారులకు పోలియో చుక్కలు వేసినట్లు అధికారులు తెలిపారు. మిగిలిన వారికి ఇంటింటికి తిరిగి వేస్తామన్నారు.
నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలుపల్స్ పోలియో కేంద్రాలను మేయర్ కొలన్ నీలాగోపాల్‌రెడ్డి సందర్శిం చారు. ఈ సందర్భంగా ఐదేండ్లలోపు చిన్నారులకు పోలియో డ్రాప్స్ తప్పనిసరిగా వేయించాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.
దుండిగల్‌లో మున్సిపల్ కమిషనర్ భోగీశ్వర్లు, మండల వైద్యాధికారి డా.నిర్మల చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
బౌరంపేటలో కౌన్సిలర్ నర్సారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పల్స్పో లియో కార్యక్రమాన్ని ప్రారంభించారు.
జగద్గిరిగుట్టలో టీఆర్ఎస్ నేత కొలుకుల జై హింద్ చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.
సుభాశ్‌నగర్ డివిజన్, సూరారం కాలనీలోని జిల్లా పరిషత్ ప్ర భుత్వ పాఠశాలలో జరిగిన పల్స్‌పోలియో కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ హేమలతాసురేశ్రెడ్డి చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.